కోహ్లీ పోస్ట్.. మళ్లీ అనుమానాలు..!

టీమిండియాలో ఇంకా వివాదాలు చల్లారినట్లు లేవు. వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌ నుంచి భారత్ వెనుదిరిగిన తరువాత నుంచి కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడు రోహిత్ ఇన్‌స్టాలో కోహ్లీ, అనుష్క ఇద్దరినీ అన్‌ఫాలో చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ప్రెస్‌మీట్‌లో వాటన్నింటిని కొట్టివేశాడు కోహ్లీ. ‘‘ఇలాంటి వాటికి స్పందిస్తూ.. మనకు మనమే ఫాంటసీలను సృష్టిస్తున్నాం’’ అంటూ ఫైర్ అయ్యాడు. మరోవైపు టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా స్పందిస్తూ.. అవన్నీ అర్థం పర్థం లేని వార్తలు అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు. దీంతో ఈ వివాదం ముగిసిపోయిందనుకున్నారు అందరూ.

కానీ మళ్లీ రోహిత్ శర్మ ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘నేను దేశం కోసం ఆడతాను. టీమ్ కోసం కాదు’’ అంటూ పేర్కొన్నాడు. దీంతో వివాదం మళ్లీ మొదలైంది. ఇదిలా ఉంటే వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం కోహ్లీ సేన అమెరికాలో ఉంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో ఓ ఫొటోను షేర్ కోహ్లీ.. ‘స్క్వాడ్ 100’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఆ ఫొటోలో కోహ్లీతో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్ ఉండగా.. రోహిత్ కనిపించడం లేదు. దీంతో ‘రోహిత్ ఎక్కడున్నాడంటూ’ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ పోస్ట్‌తో వీరిద్దరి మధ్య విబేధాలు తగ్గినట్లుగా కనిపించడం లేదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది..? కోహ్లీ, హిట్ మ్యాన్‌ మధ్య గొడవకు కారణమేంటి..? రోహిత్ మ్యాచ్‌ల్లో కంటిన్యూగా ఆడతాడా..? ఈ విషయాలన్ని ఆ పెరుమాల్‌కే తెలియాలి మరి.

veegamteam

Read Previous

Why You Shouldn’t Ride Elephants In Thailand

Read Next

అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *