పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని క్లారిటీ..

టీడీపీలో పార్టీ మారుతున్న నేతలు అధికమయ్యారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీ మార్పుపై ఆయన స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన మాట వాస్తవమే అయినా అది మర్యాద పూర్వకంగానే తప్ప పార్టీ మార్పుకోసం కాదన్నారు వల్లభనేని. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొనన్నానని తెలిపారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే ఎయిర్‌పోర్టుకు వెళ్లి పుష్పగుచ్చమివ్వడమో, లేక పార్టీ కండువా కప్పుకోవడమో చేసేవాడినన్నారు వంశీ. తాను టీడీపీలోనే కొనసాగుతానని..ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ఆలోచన తనకు లేదని టీవీ9తో చెప్పారు.

veegamteam

Read Previous

దాడుల్ని ఖండించిన చంద్రబాబు

Read Next

హోదా లేదు సాయం మాత్రమే.. స్పష్టం చేసిన కేంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *