మనం ఉన్నది.. ప్రజాస్వామ్యంలోనా..? రాక్షస రాజ్యంలోనా..?

మాజీ మంత్రి నారా లోకేష్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై.. ఒక్కొక్క ట్వీట్ చేసి హీట్ పుట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి.

ముందుగా.. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మార్షల్స్ తీసుకెళ్తున్న ఫొటోషేర్ చేశారు. ఇవాళ ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీపై నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో.. ఆగ్రహించిన చంద్రబాబు.. సభ్యులతో సహా సభ నుంచి వాకౌట్ అయ్యారు.

‘ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు, దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా?’

‘జగన్ గారు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ రూపంలో ఒక్కో మహిళకు లక్షా ఇరవై వేల రూపాయిలు ఇవ్వాలి. జగన్ గారు మడమ తిప్పడం, మాట మార్చడం ద్వారా ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకి రూ.45 వేల నష్టం కలుగుతోంది’. అంటూ నారా లోకేష్ ట్వీట్లు చేశారు.

veegamteam

Read Previous

విజయసాయిరెడ్డితో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి భేటీ..రీజన్ అదేనా?

Read Next

గ్రీన్ కార్డు బిల్లుకు యుఎస్ ఆమోదం.. భారత్ హర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *