విమానాశ్రమాల్లో అనుమతి రద్దు

దేశంలోని విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేసింది విమానయాన మంత్రిత్వశాఖ. ఈ నెల 10 నుంచి 20వరకు ఇది అమల్లో ఉండనుంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవచ్చన్న నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో సందర్శకులకు అనుమతిపై తాత్కాలిక నిషేధాజ్ఞలు విధించింది. వీటిని ఖచ్చితంగా అమలు చేయాలని దేశంలోని విమానాశ్రయాల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

veegamteam

Read Previous

సినిమాను తలపించేలా సుష్మాజీ ‘లవ్ స్టోరీ’

Read Next

హీరోయిన్ తెలుగు స్పీచ్.. దద్దరిల్లిన లోక్‌సభ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *