సినిమాను తలపించేలా సుష్మాజీ ‘లవ్ స్టోరీ’

సుష్మాస్వరాజ్.. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ ఇష్టపడే గ్రేట్ లీడర్. మోదీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన ఆమె.. చిన్నదైనా.. పెద్దదైనా ఒక్క ట్వీట్‌తో ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయందరికి సహాయం చేశారు. భారతదేశానికి సుష్మాస్వరాజ్ సేవలు మరువలేనివి. ఎంతోమందిని తల్లిలా ఆదుకున్న కరుణామయురాలు. అలాంటి ఫైర్ బ్రాండ్ సుష్మాస్వరాజ్ నిన్న రాత్రి ఎయిమ్స్ ఆసుపత్రిలో అకాల మరణం చెందారు. బీజేపీ మాత్రమే కాదు భారతదేశం కూడా ఓ గొప్ప రాజకీయ నాయకురాలిని కోల్పోయింది. ఇక సుష్మ జీవితం గురించి తెలుగుకోవాలంటే.. మొదటగా ఆమె ప్రేమకథ సరిగ్గా సినిమాను తలిపించే విధంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

1970లో పంజాబ్ వర్సిటీలోని లా కాలేజీలో చదువుతున్న రోజుల్లో సుష్మాజీకి స్వరాజ్ కౌశల్ స్నేహితుడిగా పరిచయమయ్యాడు. నిండైన కట్టుబొట్టుతో సుష్మ హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. అటు స్వరాజ్ ఇంగ్లీష్‌లో అదరగొట్టేస్తారు. ఇక ఒకానొక సందర్భంలో సుష్మాజీ మాట్లాడే తీరుకు ముగ్దుడైన స్వరాజ్ ప్రసంగం ఆపేసి.. ఆమెను చూడటం మొదలు పెట్టారు. ఇద్దరిది అభిరుచులు ఒకటే.. పైగా సోషలిస్టు భావజాలం కలిసింది. దానితో సుష్మాజీ కూడా చూపులు కలిపారు. వారి పరిచయం ప్రేమగా మారింది. అది వివాహానికి దారితీసింది.

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఒకటి వచ్చింది. వారు మధ్య ప్రేమ చిగురించిన పెళ్లి మాత్రం అంత సింపుల్‌గా జరగలేదు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సుప్రీం కోర్టులో న్యాయవాదులుగా వృత్తిని ప్రారంభించిన ఇద్దరూ నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు జార్జి ఫెర్నండేజ్ కేసును టేకప్ చేశారు. ఆ తరుణంలో కొన్ని చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అలాంటి క్లిష్ట సమయంలోనే ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. స్వరాజ్ కౌశల్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్న సుష్మకు మొదట చుక్కెదురు వచ్చింది. వీరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు.

అయితే సుష్మాస్వరాజ్ మాత్రం ఎదిరించి స్వరాజ్ కౌశల్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి బన్సూరి స్వరాజ్ అనే అమ్మాయి ఉంది. ఇక కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సుష్మాజీ పోటీ చేయలేదు. అటు కశ్మీర్ విభజనపై చివరి ట్వీట్ చేసిన ఆమె గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యి.. చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఇటీవలే  ఆమె తన  44వ వైవాహిక వేడుకలను జరుపుకున్నారు.

veegamteam

Read Previous

“రణరంగం” సెన్సార్ పూర్తి.. ఆగష్టు 15న విడుదల..

Read Next

విమానాశ్రమాల్లో అనుమతి రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *