నవరత్నాలతో నవ శకానికి నాంది

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా మనిషి అసమానతల మద్య కొట్టుమిట్టాడుతున్నారని దేశంలో ప్రతి మనిషి స్వేచ్చాయుత వాతావరణంలో జీవించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కోరారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన జెండా పండగలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పధకాల ఫలితాలు రేపటి భవిష్యత్తుకు దారులు చూపుతాయని తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన విద్యా, వైద్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టు కుంటామని అన్నారు. వాలెంటీర్లుగా నియమితులైన ప్రతి వాలెంటీర్ కూడా గ్రామ, వార్డుల్లో ప్రజా సేవలో నేటినుండి అంకితం కావాలని కోరారు. పార్టీలకు అతీతంగా పనిచేసే ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకు వెల్లేందుకు ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో మంది మహానుభావులు దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకు కల్పించిన స్వతంత్రం నేడు ఆఫలాలు ప్రజలకు పూర్తి స్థాయిగా అందాలంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలన్నారు. ప్రజల కోసం పనిచేయని ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజలు ఎన్నుకొని చట్ట సభలకు పంపించారని వారి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తూ ప్రజా సేవలో ముందుండి ప్రజలకు రక్షణ కల్పిస్తానని మాటిచ్చారు. ముందుగా రణస్థలంలో పార్టీ కార్యాలయంలో ఉన్న జాతి పిత మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులు అర్పించి దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం గుర్తు చేసుకున్నా అహింసను ఆయుధంగా మలుచుకుని ప్రపంచ దేశాలకు ఆయన మార్గదర్శిగా మారారని తెలిపారు.

one9 news

Read Previous

గాంధీ అడుగుపెట్టిన గడ్డ

Read Next

పొందరి వీదిలో పారిశుద్ధ్య పనులు

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *