ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

రిటైల్‌ బ్యాంకింగ్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ పండుగ సీజన్‌ సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వ్యక్తిగత, గృహరుణాలపై తక్కువ వడ్డీ వసూలు చేయడంతో పాటు ఈఎంఐ భారాన్ని తగ్గించే వెసులుబాటు కల్పించింది. రూ 20 లక్షల లోపు వ్యక్తిగత రుణం తీసుకునేవారికి 10.75 శాతం నుంచి వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది.

కస్టమర్లపై ఈఎంఐ భారాన్ని తగ్గించేందుకు తిరిగిచెల్లించే గడువును ఆరు సంవత్సరాలుగా నిర్ధారించింది. ఇక వేతన ఖాతాదారులకు రూ 5 లక్షల వరకూ డిజిటల్‌ లోన్స్‌ను యోనో యాప్‌ ద్వారా కేవలం నాలుగు క్లిక్‌లతోనే వారి ఖాతాలో చేరేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు రూ 50 లక్షల వరకూ విద్యా రుణాలను 8.25 శాతం వడ్డీరేటుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎడ్యుకేషనల్‌ లోన్‌ కస్టమర్లు 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించడంతో వారిపై ఈఎంఐ భారం తగ్గనుంది. మరోవైపు సెప్టెంబర్‌ 1 నుంచి గృహ రుణాలపై కేవలం 8.05 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేయనుంది.

one9 news

Read Previous

ఆస్ట్రాయిడ్‌ భూమిని ఢీకొడితే

Read Next

కిడ్నీలో రాళ్లని వెళ్లి.. ముగ్గురికి జన్మనిచ్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *