అన్ని సర్వేలు మీద్వారానే

పలాస:

వార్డు వాలెంటీర్లు గా ఎంపికైన వారు ప్రభుత్వ సేవలు, సర్వేలు అన్నీ మీ ద్వారానే జరగాలని మండల తహశీల్దారు బాబ్జీరావు అన్నారు. స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో గురువారం వార్డు వాలెంటీర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలైన సేవలు అందించాలని ఇంటింటికి పధకాలను అందాలనే ఉద్దేశం గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని గాంధీ కలలను నెరవేర్చే దిశగా పరిపాలన కినసాగించాలని ఆలోచిస్తున్నందున ప్రజలకు అవసరమైన ప్రతి సేవా మీ ద్వారా జరగాలని కోరారు. మున్సిపల్ కమీషనర్ టి.రాజగోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందించాలంటే ప్రతి వాలెంటీర్ కూడా స్వచ్చమైన సేవ అందించాలని కోరారు. మీకు అప్పగించిన ప్రతి ఇంటికి మీరే పెద్ద దిక్కు కావాలని కోరారు.

one9 news

Read Previous

ప్రారంభానికి సిద్దమౌతున్న ఎమ్మర్వో కార్యాలయం

Read Next

వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కల్గించే వారిని కఠినంగా శిక్షించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *