కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి

అరబిందో యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు డిమాండ్ చేశారు.గురువారం పైడిభీమవరం జంక్షన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో అరబిందో యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరబిందో యాజమాన్యం గత 16 నెలలు గా చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తోందని వివరించారు.అరబిందో యాజమాన్యం గత సంవత్సరం 1800 కోట్ల రూపాయలు లాభాలు అర్జించినా కార్మికుల కు వేతనాలు పెంచకుండా దుర్మార్గంగా వ్యవరిస్తుందని విమర్శించారు. అరబిందో యాజమాన్యం ఏకపక్షంగా ఎటువంటి విచారణ చేయకుండా అన్యాయంగా కార్మికులను తొలగిస్తుందని విమర్శించారు.ఇటీవల అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జె. శ్యామలరావును ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా నిలుపుదల చేసిందని విమర్శించారు.నిలుపుదల చేసిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయలు లాభాలు అర్జిస్తున్న అరబిందో యాజమాన్యం కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. యాజమాన్యం వేతనాలు పెంచకపోవడంతో కార్మికుల కుటుంబాలు అర్ధాకలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పరిశ్రమ ప్రారంభం నుంచి గత 17సంవత్సరాలుగా శాశ్వత స్వభావం గల పనులలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.అరబిందో యజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఇటీవల జరిగిన ప్రమాదంలో బి.రాజారావు, బి.రాహుల్ మృతి చెందారని,పెన్సిల్లిన్ ప్లాంటు లో అల్లంపల్లి. శివ గాయపడ్డారని విమర్శించారు.ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న కార్మికుల భద్రతను యాజమాన్యం పట్టించుకోడంలేదని విమర్శించారు. యాజమాన్యం పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. పవర్ ప్లాంట్,క్యాంటీన్ కార్మికులపై యజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు‌. కార్మికులకు బస్ సౌకర్యం లేకపోవడంతో కార్మికులు రోడ్డు ప్రమాదాలకు గురయి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కార్మికులందరికి బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అరబిందో యాజమాన్యం కార్మికులను బానిసలుగా పనిచేయించడం కోసం యూనియన్ లేకుండా చేయాలని కుట్రలకు పాల్పడుతుందని అన్నారు.అరబిందో
పరిశ్రమ వద్ద 144 సెక్షన్, సెక్టన్30ని పెట్టి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.తక్షణమే 144 సెక్టన్,సెక్టన్-30ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే యూనియన్ తో చర్చలు జరిపి కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.కార్మికులందరికి యూనిఫారంలు ఇవ్వాలని, కార్మికుల పి.ఎఫ్ అకౌంట్ లలో ఉన్న తప్పులను సరిచేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో స్థానికులకు ఉద్యగాలు కల్పించాలని, సిఎస్ఆర్ నిధులు గ్రామాల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేసారు.ఆగస్టు 26న అరబిందో యాజమాన్యానికి సిరి- కార్మికు లకు ఉరి కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్. అమ్మన్నాయుడు,అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.గురునాయుడు,నాయుకులు ఎస్.సీతారామరాజు,జె. శ్యామలరావు లంకలపల్లి. రాంబాబు,సి.హెచ్. నర్సింహులు,యం.సూర్యారావు, ఎస్.అప్పలరాజు,తపస్ మెహతా,కె.సన్యాసిరావు, పాల్గొన్నారు.

one9 news

Read Previous

సుప్రీం సంచలన తీర్పు..

Read Next

ప్రారంభానికి సిద్దమౌతున్న ఎమ్మర్వో కార్యాలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *