ప్రారంభానికి సిద్దమౌతున్న ఎమ్మర్వో కార్యాలయం

పలాస:

పలాస మండల తహశీల్దారు నూతన కార్యాలయం ఈ నెల 24 వ తేదీన ప్రారంభానికి సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోటి పదిలక్షల రూపాయల నిధులతో కొత్త భవనాన్ని నిర్మించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణదాసు చేతులు మీదుగా ప్రారంభం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పలాస మండల ప్రజల రెవెన్యూ సమస్యలకై వచ్చే ప్రజలకు సరైన కార్యాలయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిబ్బందికి సరైన వసతులు లేవు ,రెవెన్యూ రికార్డులు భద్రపరిచేందుకు గదులు లేకపోవడం చూస్తే ప్రస్తుత రెవెన్యూ కార్యాలయం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. ఎంత త్వరగా కొత్త భవనం ప్రారంభం జరిగితే ప్రజలకు మెరుగైన సేవలు అందటమే కాకుండా రికార్డులు భద్ర పరిచేందుకు అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు.

one9 news

Read Previous

కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి

Read Next

అన్ని సర్వేలు మీద్వారానే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *