సుప్రీం సంచలన తీర్పు..

సహజీవనంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి, అతనితో శారీరక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం కిందకు రాదని ప్రకటించింది. సేల్స్‌ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అయిన ఓ మహిళ సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌తో ఆరేళ్లపాటు సహజీవనం చేసింది. వీరిద్దరూ ఒకరి ఇళ్లలో మరొకరు నివాసముంటూ సహజీవనం చేశారు. కానీ, అతడు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బలవంతంగా తనతో శారీరక సంబంధం ఏర్పరచుకొని ఆరేళ్లపాటు సహజీవనం చేశాడని, ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల ధర్మాసనం అత్యాచారం కేసును కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అంగీకార సహజీవనం రేప్ కిందకు రాదని తేల్చి చెప్పింది. తప్పుడు హామీ ఇచ్చాడని మహిళ తరఫు న్యాయవాది వాదించగా.. అలా ఎలా చెప్పగలమని కోర్టు స్పష్టం చేసింది.

one9 news

Read Previous

కూతుళ్లపై తండ్రి పైశాచిక చర్యలు:సహకరించిన తల్లి

Read Next

కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *