వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కల్గించే వారిని కఠినంగా శిక్షించాలి

  • మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజి
  • ఫేస్ బుక్ వ్రాతలపై ఫిర్యాదు.

పలాస:

ఇటీవల సామాజిక మాధ్యమం అయిన ఫేస్ బుక్ లో కొంత మంది వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పనిగట్టుకుని ఫేస్ బుక్ ఫేక్ ఎకౌంట్లను క్రియేట్ చేస్తూ ఫేస్ బుక్ వేదికగా అసభ్యకరమైన పదజాలంతో తనపై తప్పుడు వ్రాతలు వ్రాస్తున్న వారిని గుర్తించాలని కాశీబుగ్గ సి.ఐ వేణుగోపాలరావును కోరారు. మాధ్యమాల్లో తనపైనే కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే కుటుంబం పై కూడా తప్పుడు వ్రాతలను వ్రాస్తున్న వాటిపై ఖండించారు. తప్పు ఎవరు చేసినా తప్పే అంటూ ఆవేదన చెందారు. 35 సంవత్సరాలుగా సోంపేట, పలాస నియోజకవర్గాలలో ఎమ్మెల్యే చేసి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండటమే కాకుండా స్వతంత్ర సమరయోధుడు బిడ్డగా సర్ధార్ గౌతు లచ్చన్న కొడుకుగా ఆయన ఆశయ సాధనకు నేటికీ ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల మనిషిగా ఉంటున్న నా కుటుంబం పై ఫేస్ బుక్ లో తప్పుడు వ్రాతలు వ్రాస్తున్న లఖినాన కిషోర్, మల్లా సంతోష్ కుమార్,శ్రీ తిరుమల,పుక్కళ్ళ లక్ష్మణకుమార్ లు మాట్లాడలేని, వ్రాయలేని అసభ్యకర పదజాలంతో అసత్య ఆరోపణలు తనపై తన కుటుంబం పై చేశారన్నారు. పరువు ప్రతిష్టలను భంగం చేస్తూ కించపరిచే విదంగా సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేస్ బుక్ పోస్టింగులకు బాధ్యులు అయిన వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాశీబుగ్గ పోలీసులను కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలు పునరావృతం కాకుండా చూడాలని సి.ఐ వేణుగోపాలరావుకి గౌతు శ్యామసుందర శివాజీ పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావు, పట్టణ అధ్యక్షులు లొడగల కామేసు, రాజు, విజయ్ లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

one9 news

Read Previous

అన్ని సర్వేలు మీద్వారానే

Read Next

వచ్చే ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ చేయూత’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *