వచ్చే ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ చేయూత’

 

– లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: వైఎస్సార్‌ చేయూత పథకం కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.18,750 ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ శాఖలపై గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన.. వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో క్రమం తప్పకుడా తనిఖీలు చేయాలని సూచించారు. బడుల్లో 9 రకాల సౌకర్యాలను మూడు దశల్లో కల్పించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి పాఠశాలలు తెరిచే సమయానికే యూనిఫారాలు, పుస్తకాలు అందాలని స్పష్టంచేశారు.

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉండాలని, ఆ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బిల్లు సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం, పాడేరులో గిరిజన వైద్య కళాశాల, కురుపాంలో ఇంజినీరింగ్‌ కళాశాల, ఏడు ఐటీడీఏల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. అరకు, పాలకొండ, పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి పచ్చజెండా ఊపారు. ఆ మేరకు  ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. గిరిజనులకు అటవీ భూముల పట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

one9 news

Read Previous

వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కల్గించే వారిని కఠినంగా శిక్షించాలి

Read Next

మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *