అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

వన్9 న్యూస్: మెళియాపుట్టి

వ్యవసాయానికి  వినియోగించే  ఎరువులు ,పురుగుల మందులు  అధిక  ధరలకు  విక్రయిస్తే  వారిపై  చర్యలు తీసుకోవడం  జరుగుతుందని  మండల .వ్యవసాయ శాఖ అధికారి  పూజారి సత్యనారాయణ అన్నారు. జ్జాడు పల్లి లో ఎరువుల దుకాణం తనిఖీ చేశారు .ఈ సందర్భంగా రికార్డులను ,సరుకులను  ఆయన పరిశీలించారు. ధరల పట్టికలు అందరకు  కనబడేలా, వేలాడదీయాలి అని అన్నారు. జోడు రు, జాడు పల్లి ,తదితర ,గ్రామాలలో  స్వర్ణ మసూరి కి  అగ్గి తెగులు నివారణ కొరకు  ట్రై సైక్లో జోన్  15 గ్రాముల మందును  ఒక లీటర్  నీటిలో  కలిపి పిచికారి చేయాలని అన్నారు. అదేవిధముగా  పీక పురుగు  నివారణ కొరకు  cartaf  హైడ్రో క్లోరైడ్, రెండు గ్రాముల మందును లీటర్ నర  నీటిలో కలిపి  పిచికారి  చేయాలని  అన్నారు ఆయనతోపాటు  వ్యవసాయ శాఖ  సిబ్బంది పాల్గొన్నారు.

one9 news

Read Previous

మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు

Read Next

సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయంటే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *