మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు

వన్9 న్యూస్: మెళియాపుట్టి

ఆశ్రమ పాఠశాలలో మెనూ పాటించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటీడీఏ పీవో సాయి కాంత్ వర్మ అన్నారు. పెద్దమడి  బాలికల  ఆశ్రమ  పాఠశాలను ఆకస్మికంగా  సందర్శించారు. ఈ. సందర్భంగా  రికార్డులను , వంటశాల ను పాఠశాల పరిసరాలను  పరిశీలించారు .. విద్యార్థులకు  పాఠాలు  బోధించి, విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు .విద్యార్థులు  బాగా చదువుతున్నారు  అని  ప్రధానోపాధ్యాయులు  ఈశ్వరరావు ఉపాధ్యాయులకు  అభినందించారు .సీజనల్ .వ్యాధుల  పట్ల  ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అన్నారు .డైనింగ్  రూమ్ తో, పాటు  ప్రహరీ లేకపోవడంతో, ఇబ్బందులు  పడుతున్నామని  తెలిపారు.నిధులు  మంజూరు  చేసి,పనులు చేస్తామని అన్నారు. పాఠశాలకు  30  సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేస్తామన్నారు. అనంతరం కరజాడ పిహెచ్సి ని పరిశీలించారు . సీజనల్  వ్యాధుల  పట్ల వైద్యు సిబ్బంది అప్రమత్తంగా ఉండి ,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. రోగులతో ఆయన మాట్లాడి, వైద్యసేవలు ఏ విధంగా అందుతున్నాయనిఅడిగి తెలుసుకున్నారు. అవసరమైన .మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు .ఆసుపత్రికి  నిధులు ,HDF నిధులు, లేకపోవడంతో  ఐటీడీఏ  నుంచి  నిధులు మంజూరు చేస్తామని అన్నారు.

one9 news

Read Previous

వచ్చే ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ చేయూత’

Read Next

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *