
- ఫ్లై ఓవర్ పైనుంచి పడిన కారు
- ఐదుగురికి తీవ్రగాయాలు, మహిళ మృతి
హైదరాబాద్: ఫ్లై ఓవర్పై నుంచి కారు ఒక్కసారిగా కింద పడటంతో కారులో ఉన్న ముగ్గురితో పాటు.. ఫ్లై ఓవర్ కింద ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఒక మహిళ మృతి చెందింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ ప్రమాదం జరిగింది. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి కారు ఒక్కసారిగా కింద పడింది. అయితే ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఫ్లై ఓవర్ కింద ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.