
– మనజనం రాష్ట్ర అధ్యక్షులు: గోవిందరావు
తగినంత స్వచ్ఛమైన జలం సేవిస్తే శరీర ఆరోగ్యానికిమరింత బలం చేకూరుతుంది అని “మనజనం సేవా సంస్థ” రాష్ట్ర అధ్యక్షులు జనపాల గోవిందరావు అన్నారు.
ఇటీవల రాష్ట్రప్రభుత్వం చేపట్టిన నీటిగంట కార్యక్రమంలో భాగంగా “ఈనాడు” సౌజన్యంతో “మనజనం సేవా సంస్థ” ఆధ్వర్యంలో శనివారం గుర్రాలపాలేం ప్రాధమిక పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవనవిధానంలో త్రాగునీటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ నీటి పొదుపును విధ్యార్థులు పాటించేలాగ అలాగే జలవనరుల సంరక్షణ కొరకు విద్యార్థులలో ప్రేరణ కలిగించారు. కార్యక్రమంలో భాగంగా “మనజనం” ఆధ్వర్యంలో ఉచితంగా నీటిసీసాలు (వాటర్ బాటిల్స్) పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో “సమాచారహక్కు ప్రచార ఐక్య వేదిక” మండల అధ్యక్షులు చంద్రశేఖర రావు, సి.ఆర్. పి వెంకట్రావు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.