Breaking News

భావితరాలకు ఆదర్శంగా ఏపీ సైన్స్ కాంగ్రెస్

విశ్వ వ్యాప్తంగా ఎక్కువ శాతం మంది పెన్ కాట్రిక్ క్యాన్సర్ తో మృతి చెందుతున్నారని పరిశోదకులు అభిప్రాయం వ్యక్తం పరిచారు.. అదృష్టవశాత్తు ఇలాంటి క్యాన్సర్ నివారణకు కొనసాగుతున్న పరిశోధనలు తుదిదశకు చేరుకోవడం మూలంగా సత్పలితాలు సాధించేందుకు ఐఐటి మద్రాస్ బయో టెక్నాలజీ అధ్యాపక బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఏపి సైన్స్ కాంగ్రెస్ రెండోరోజు కార్యక్రమాల్లో భాగంగా శాస్త్ర, సాంకేతిక నూతన ఆవిష్కరణలు, ఫలితాలు, పరిశోధన పద్దతులు గూర్చి విశ్వవిద్యాలయంలో చర్చ జరిగింది.. ఇందులో భాగంగా ఎక్స్ రే, స్కానింగ్, uv స్పెక్ట్రోస్కోపి క్ గురించి నిపుణులు క్లుప్తంగా వివరించారు.. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ తో అనేక మంది బాధపడుతున్నారని దీనికి సంభందించి నూతన జీవఔషద వైద్య విధానాలు, వ్యూహాలు గురించి తెలియజేశారు.. రెండవ రోజు ఏపి సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా శాస్త్రీయ అంశాల పై చర్చ జరిగిందని ఏపి అకాడమి ఆఫ్ సైన్సెస్ కార్యదర్శి ప్రోపెసర్ ఎంవి బసవేశ్వరరావు స్పష్టం చేశారు.. కాగా శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొనసాగుతున్న సైన్స్ సంబరం వైజ్ఞానిక వెలుగులు విరజిమ్మేలా భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుండడం సంతోషించదగ్గ పరిణామమని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కూన రామ్ జీ తెలిపారు..

one9 news

Read Previous

రాజ్యాంగమే మహోన్నతమైన గ్రంథం:గవర్నర్ హరిచందన్

Read Next

భావితరాలకు ఆదర్శంగా ఏపీ సైన్స్ కాంగ్రెస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *