Breaking News

ఆడపిల్లను ఎందుకు కన్నానా అని భయపడుతున్నా: రోజా

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసుపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా స్పందించారు. ప్రియాంకను హత్య చేసిన వారిని బహిరంగంగా ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి కామాంధులకు దుబాయ్‌లో వేసే లాంటి శిక్షలు వేయాలని.. ఇంకో ఆడపిల్ల మీద చేయి వేయాలంటే భయపడేట్టు చేయాలని రోజా అన్నారు. తనకు ఓ ఆడపిల్ల ఉందని.. ప్రస్తుత దారుణాలను చూస్తుంటే అడపిల్లని ఎందుకు కన్నానా..? అని భయపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులు మన కులమనో, మన మతమనో వారికి సాయం చేయకూడదని ఆమె అన్నారు. నేరస్తులకు ఏదైనా జరిగితే వారికి మద్దతుగా ముందుగా వచ్చే మానవహక్కుల సంఘాలకు ఇలా బలైపోతున్న ఆడపిల్లల చావులు కనిపించవా..? అని ప్రశ్నించారు. ఇక అమ్మాయి కనపడటం లేదని ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మీ అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందని పోలీసులు అనడం బాధాకరమని ఆమె చెప్పుకొచ్చారు. ఆ పోలీసుల కూతుళ్ళకి ఇలా జరిగితే అదే మాట అంటారా..? అని రోజా ఘాటుగా ప్రశ్నించారు.

one9 news

Read Previous

భావితరాలకు ఆదర్శంగా ఏపీ సైన్స్ కాంగ్రెస్

Read Next

దిషా (ప్రియాంక) ఇంటికి తాళాలు.. ఉద్రిక్తత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *