Breaking News

హైదరాబాద్‌లో కరోనాతో డాక్టర్ మృతి

తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూ…పరిస్థితి భయానకంగా మారుతోంది. కోవిడ్ కారణంగా నగరంలో ఓ డాక్టర్ మృత్యువాత పడ్డారు. నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ అనారోగ్యం కారణంగా ఈ నెల 16న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 18న డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆదివారం (జూన్21న) రాత్రి చికిత్స పొందుతూ డాక్టర్ ప్రాణాలు విడిచారు. నాలుగు దశాబ్ధాలుగా ఖైరతాబాద్‌లో డాక్టర్ క్లినిక్ నిర్వహిస్తున్నారు.

one9 news

Read Previous

ఆ చైనా యాప్స్‌పై నిషేధం విధించలేదుః కేంద్రం

Read Next

ముగిసిన అచ్చెన్నాయుడు తొలిరోజు విచారణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *