Breaking News

పట్టణం నుండి పల్లెలకు పాకిన కరోనా వైర‌స్‌

వై.టి.టీ.వి న్యూస్ః శ్రీ‌కాకుళం

కరోనా మహమ్మారి పట్టణం నుండి పల్లెలకు శరవేగంగా పాకుతోంది. కొన్నిరోజులు ప్రశాంతంగా ఉన్న సిక్కోలులో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. వైరస్ ప్రారంభం దశలో ఒకటి లేదా రెండు కేసులు నమోదై వైద్య సేవలు అనంతరం బాధితులు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అనంతరం నెలన్నర పాటు జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. జనం సాదారణ కార్యకలాపాలు సాగించారు. అయితే మళ్లీ జూన్ మొదటి వారంలో వైరైస్ జిల్లాలో తన పంజా విసిరితుంది. ఈ రెండు నెలలు నుంచి నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, ఛైన్నై, బెంగళూరు, గుజరాత్, కర్ణాటకతో పాటు ఇతర దేశాలు నుండి వచ్చినవారు కావడం కొంత ఆందోళన కలిగించే విషయం. కాగా కుసులు జిల్లాలో భారీగా పెరుగుతుండడంతో సిక్కోలులో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంతో షీకార్లు పుకార్లు చేస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా కేసలు…
తాజాగా జిల్లాలోని రణస్థలం మండలంలో నలుగురికి ఇటివల కరోనా పాజిటివ్గటా నిర్ధారణ అయిందని విశ్వసనీయ సమాచారం. కరోనా పాజిటివ్ వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 50 మందికి రణస్థలం మండల కేంద్రంలోని బాలుర వసతిగృహంలో రాఫిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ రణస్థలం మండల కేంద్రంలో పర్యటించి వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటికే జె.ఆర్.పురం గ్రామ ప్రజలు, వ్యాపారస్తులంతా స్వచ్ఛంద్ర మూడు రోజులు పాటు బంద్కు పిలుపునిచ్చారు. బంద్ చేపట్టి ఒక రోజు గడచినప్పటికి జిల్లా కలెక్టర్ పర్యటన నేపధ్యంలో మూడు రోజులు బంద్తో ఏం సాధించలేమని మరో వారం రోజులు పాటు ఇదే స్ఫూర్తితో బంద్ను కొనసాగించాలని అధికార్లుకు కలెక్టర్ ఆదేశించారు. కరోనా వైరస్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దీనికి ప్రజలంతా సహకరించాలన్నారు. కనీసం రెండు మీటర్లు వరకు భౌతిక దూరం పాటించాలని, ఎలాంటి కరోనా లక్షణాలు ఉన్నా వెంటనే సమాచారం అందించాలన్నారు. మాములు జలుబు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రజలు తగిన విధంగా తమ వంతు బాధ్యతగా వైద్య సిబ్బందికి సమాచారం అందించాలన్నారు.

one9 news

Read Previous

ఏపీ ఖాతాలో మరో రికార్డు.. దేశంలోనే తొలి స్థానం

Read Next

సీఎంకు హ‌ర్షం వ్య‌క్తం చేసిన అంబేద్క‌ర్ సేవా సంఘం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *