Breaking News

సీఎంకు హ‌ర్షం వ్య‌క్తం చేసిన అంబేద్క‌ర్ సేవా సంఘం

వై.టి.టీ.వి న్యూస్ః ర‌ణ‌స్థ‌లం
ద‌ళితుల ప‌ట్ల ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చూపిన ప్రేమ, అప్యాయ‌త మ‌రువ‌రానిద‌ని ర‌ణ‌స్థ‌లం మండ‌లం అంబేద్క‌ర్ సేవా సంఘం అధ్య‌క్షులు భ‌విరి ర‌మ‌ణ‌మాష్టార్ అన్నారు. సోమ‌వారం ర‌ణ‌స్థ‌లం అంబేద్క‌ర్ విగ్ర‌హాం వ‌ద్ద సంఘ అధ్య‌క్షులు ర‌మ‌ణ మాష్టార్ ఆధ్వ‌ర్యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేయడం అయిన‌ది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర రాజ‌ధాని న‌డిబొడ్డున ప్ర‌పంచ మేధావి డాక్ట‌ర్ బి.ఆర్ అంబేద్క‌ర్ 125 అడుగుల ఎత్తుగ‌ల విగ్ర‌హాన్ని పీడ‌బ్యూడి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయ‌డానికి సీఎం శంకుస్థాప‌న చేయ‌డం ప‌ట్ల రాష్ట్రంలో ఉన్న‌ట్టివంటి ద‌ళితులంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తు ర‌ణ‌స్థ‌లం మండ‌లంలో ఉన్న ద‌ళిత వ‌ర్గం అంతా ముఖ్య‌మంత్రికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ద‌ళితుల‌కు అరుదైన గౌర‌వం క‌ల్పిస్తున్నందుకు ద‌ళిత వ‌ర్గం అంతా ఆయ‌న ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్రమంలో సంఘ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి శ్యామ్‌బాబు, ఉపాధ్య‌క్షుడు వై. సోములు, స‌హాయ‌కార్య‌ద‌ర్శి పి రాము, కె త్రినాధ‌రావు, యూత్ అర్గ‌నైజ‌ర్ కె. కోటేశ్వ‌ర‌రావు, యామ‌ల మ‌ల్లేష్‌, గౌర‌వ అధ్య‌క్షులు భ‌విరి శంక‌ర‌రావు ముఖ్య స‌ల‌హాదారులు పి. నీల‌య్య‌, పి. అప్ప‌న్న మ‌రియు సంఘం స‌భ్యులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

one9 news

Read Previous

పట్టణం నుండి పల్లెలకు పాకిన కరోనా వైర‌స్‌

Read Next

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *