Breaking News

మహిళల కోసం మరో రెండు పధకాలు.. జగన్ సర్కార్ సంచలనం

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళల సాధికారత కోసం ఆగష్టు, సెప్టెంబర్‌లలో మరో రెండు సంక్షేమ పధకాలను ప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ భేటిలో ఆయన పలు కీలక వ్యాఖ్యల చేశారు.

ఆగష్టులో ప్రారంభించే ‘వైఎస్ఆర్ చేయూత’ పధకం కింద 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని అందిస్తామన్నారు. అలాగే సెప్టెంబర్‌లో ‘వైఎస్ఆర్ ఆసరా’ పధకం ద్వారా డ్వాక్రా మహిళలకు రూ. 6700 కోట్ల రుణ సాయం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇక ఈ రెండు పధకాలతో సుమారు కోటి మందికి పైగా మహిళలు లబ్ది పొందుతారని ఆయన తెలిపారు.

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల కోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు చొప్పున నాలుగేళ్లకు రూ. 44 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. వారి జీవితాలను మార్చేందుకు ఈ సహాయం ఉపయోగపడాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దీనికి బ్యాంకర్లు కూడా తోడ్పాటు అందించాలన్నారు.

one9 news

Read Previous

కరోనా టీకాపై డోనాల్డ్ ట్రంప్ క్లారిటీ

Read Next

ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *