Breaking News

త‌న పోలాన్ని వైయ‌స్‌.ఆర్ స్ముతి వ‌నంగా నామ‌క‌ర‌ణం చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

వై.టి.టీ.వి న్యూస్ః ర‌ణ‌స్థ‌లం
మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి11వ వర్థంతి సందర్భంగా ఎచ్చెర్లనియోజకవర్గం శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ తన స్వగ్రామమైన పాతర్ల పల్లి గ్రామంలో తన సొంత పొలంలో 6ఎకరాల్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుగా కొబ్బరి మొక్కలను నాటి వాటికి వై.యస్.ఆర్ స్ముతి వనం గా ఆయ‌న నామకరణం చేశారు.ఈ సందర్భంగా గొర్లె కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ దివంగ‌త నేత‌ వై.యస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం ఈ రోజు ఈ కార్యక్రమంను చేయడం చాలా సంతోషంగా ఉందని వైస్సార్ రైతులకోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని రైతుల పక్షపాతిఅని అదేవిధంగా తన తనయుడు వై.యస్ జగన్మోహన్ రెడ్డి వైస్సార్ రైతు భరోసా అనే పథకం ద్వారా లబ్ధిదారులకు ఏటా13500-/రూపాయలు అందిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అదేవిధంగా రైతుల ఖాతాల్లోకే విద్యుత్ సబ్సిడీ ఎంత వాడుకున్నా ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుందని బిల్లుకు ముందు రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ ఆ తర్వాత వారి ద్వారా డిస్క్ మ్ లకు చెల్లింపు, ఉచిత విద్యుత్ పథకం ఇక మరింత కట్టుదిట్టంగా అక్రమ కనెక్షన్లన్నీ క్రమబద్దీకరణ నగదు బదిలీని కేంద్రం తప్పనిసరి చేయండంతో రైతులపై పైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలోవైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోలుగు కృష్ణ, చౌదరి రాము తదితరులు పాల్గొన్నారు.

one9 news

Read Previous

ఉప‌ముఖ్య‌మంత్రి దాస‌న్న‌కు స్వాగ‌తం ప‌లికిన ఎమ్మెల్యే కిర‌ణ్‌కుమార్‌

Read Next

బీహార్‌లో మొదలైన ఎన్నికల సందడి- ఎన్‌డీఏ వైపుకొచ్చిన మాంఝీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *