Breaking News

అంత‌ర్వేది దుండగుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

వై.టి.టీ.వి న్యూస్ః ర‌ణ‌స్థ‌లం
తూర్పుగోదావ‌రి జిల్లా అంత‌ర్వేది గ్రామంలో శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి వారి ర‌థం ద‌గ్ధం సంఘ‌ట‌న యావ‌త్ ఏపీలో ఉన్న హిందూ ప్ర‌జ‌ల హృద‌యాల‌ను దార‌ణంగా గాయ‌ప‌రచిన సంఘ‌ట‌న‌ని ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గ బీజెపీ ఇన్‌చార్జ్ న‌డుకుదిటి ఈశ్వ‌ర‌రావు అన్నారు. హిందూ దేవాల‌య‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ఆయ‌న ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల త‌హ‌శీల్థార్ ల‌కు విన‌తిప‌త్రాల‌ను అంద‌జేశారు. తొలిత ర‌ణ‌స్థ‌లం మండ‌ల కేంద్రంలో ఉన్న రామ‌తీర్ధాల జంక్ష‌న్ నుండి ర‌ణ‌స్థ‌లం త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ర‌కు ర్యాలీ చేప‌ట్టారు. అనంత‌రం ర‌ణ‌స్థ‌లం మండ‌ల త‌హ‌శీల్ధార్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హిందూ దేవాల‌య భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్న అధికారుల మాట‌లు చేత‌లు వారి చిత్త‌శుద్దిపై సందేహాలు క‌ల్గిస్తున్నాయ‌ని అన్నారు. రాష్ట్రంలో ఆల‌యాల‌కు ర‌క్ష‌ణ కొర‌వ‌డుతోంద‌న్న భావం హిందూ భ‌క్తుల‌లో రోజు రోజుకు పెరుగుతుంద‌ని తెలిపారు. హిందూ దేవాల‌య ఆస్తుల‌ను కాపాడంలో రాష్ట్ర దేవ‌దాయ‌శాఖా మంత్రి పూర్తిగా విఫ‌లం అయ్యార‌ని, వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గ బీజెని ఇన్‌చార్జ్ ఎన్‌. ఈశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నాలుగు మండ‌లాల‌కు చెందిన మండ‌ల పార్టీ అధ్య‌క్షులు, బెజెపి నాయ‌కులు, విశ్వ‌హిందూ ప‌రిష‌త్ కార్య‌క‌ర్త‌లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

one9 news

Read Previous

జగన్ నిర్ణయంపై స్వరూపానందేంద్ర హర్షం

Read Next

మరో రెండు రోజుల్లో అనుమతి వచ్చే ఛాన్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *