Breaking News

ద‌స‌రాకు ముందే ఏపీ-తెలంగాణ మ‌ధ్య బ‌స్సులు…?

ఏపీ, తెలంగాణ మ‌ధ్య అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసుల‌పై రెండు రాష్ట్రాలు మ‌రోసారి స‌మావేశం కానున్నాయి. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీలు భేటీ కాబోతున్నారు. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ లో ఈ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది.కరోనా కారణంగా ఏడు నెలలుగా నిలిచిపోయిన ఏపీ, తెలంగాణ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి గతంలో అనేక సార్లు చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ కొలిక్కి రాలేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఈడీలు ఇప్ప‌టికే మూడుసార్లు భేటీ అయ్యారు. కానీ రాబోయేదంతా పండుగ సీజ‌న్ కావ‌టంతో ఇప్ప‌టికే భారీ న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది మంచిది కాద‌ని ఇరు రాష్ట్రాల అధికారులు భావిస్తున్నారు. క‌నీసం తాత్కాలిక ఒప్పందం ప్ర‌కార‌మైన బ‌స్సులు పున‌రుద్ధ‌రించాల‌న్న ఆలోచ‌న‌తో చ‌ర్చ‌లు జ‌ర‌గనున్నాయి. అయితే ఇరు రాష్ట్రాలు ఎన్ని స‌ర్వీసులు న‌డ‌పాలి, ఏయే రూట్ల‌లో న‌డ‌పాలో ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు.

one9 news

Read Previous

జనవరికల్లా కరోనా వ్యాక్సిన్!.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Read Next

దీపావళి నుండి సినిమా ప్రదర్శనలు : ఎగ్జిబిటర్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *