Breaking News

ర‌ణ‌స్థ‌లంలో య‌ధేచ్ఛ‌గా పాలిథిన్ క‌వ‌ర్లు వినియోగం

– వీడ‌ని పాలిథిన్ క‌వ‌ర్ల స‌మ‌స్య‌
– అటువైపు చూడ‌ని మండ‌ల‌ ఎంపీడిఓలు
– గ్రామాల్లో న‌ర‌కం చూస్తున్న ప్ర‌జ‌లు
– ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసిన పాల‌కులు
జ‌యం న్యూస్ః ర‌ణ‌స్థ‌లం
ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంలో నిషేధిక పాలిథిన్ క‌వ‌ర్ల వినియోగం య‌ధేచ్ఛ‌గా సాగుతోంది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం 50 మైక్రాన్ల లోపు మందం ఉన్న క‌వ‌ర్లును వినియోగించ‌రాదు. ఇటువంటి క‌వ‌ర్లు అమ్మినా, వినియోగించినా అప‌రాధ రుసుము వ‌సూలు చేయ‌టంతో పాటు క‌వ‌ర్లను సీజ్ చేయాలి. అయితే ఎచ్చెర్ల‌, లావేరు, ర‌ణ‌స్థ‌లం, జి.సిగ‌డాం మండ‌లాల్లో మాత్రం పాలిథిన్ క‌వ‌ర్ల వ్యాపారం య‌థేచ్ఛ‌గా జ‌రుగుతోంది. ప‌ర్యావ‌ర‌ణానికి హానీ క‌లిగించే అతి ప‌ల్చ‌ని పాలిథిన్ క‌వ‌ర్లు చెత్త‌కుప్ప‌లు, కాలువ‌ల్లో చేరి పారిశుధ్యం స‌మ‌స్య‌ను సృష్టిస్తున్నాయి. కాలువ‌ల్లో, రోడ్ల వెంబ‌డి ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో రోజుకు 120 ట‌న్నులు ఘ‌న వ్య‌ర్థాలు ఉత్ప‌త్త‌వుతుండ‌గా, అందులో 10-15 శాతం వ‌ర‌కూ పాలిథిన్ వ్య‌ర్థాలే ఉండ‌టం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం. పాలిథిన్ నియంత్రించ‌టంలో మండ‌ల అధికార్లు నిద్ర న‌టిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అందులో ఎక్కువ‌ జ‌న‌సాంద్ర‌త క‌ల్గిన మండ‌లంగా పిలువ‌బ‌డిన ర‌ణ‌స్థ‌లం మండ‌ల ఎంపీడీఓ ప‌నితీరుపై మండ‌లప్ర‌జ‌లతో పాటు సిబ్బంది కూడా అస‌హానం వ్య‌క్తం చేస్తున్నారు. మండ‌లంలో ఏ గ్రామం చూసిన పారిశుధ్యంతో తాండ‌విస్తుంది. క్రిందిస్తాయి సిబ్బందితో పాటు, ఎంపీడీఓ వ‌ర‌కు ముడుపులు అందుతుండ‌టంతోనే పాలిథిన్ నిషేధంపై వారు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో కుక్క‌ల సంచారం విప‌రీతంగా పెరిగిపోయి పుర‌వీధుల్లో గుంపులు గుంపులుగా కుక్క‌లు సంచ‌రించ‌డంతో వృద్ధులు, పిల్ల‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అంతేకాకుండా కోత‌లు దాడుల‌తో ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. పందుల సంచారం సైతం ఎక్కువ‌గా ఉండ‌టం ప‌ట్ల మండ‌ల ప్ర‌జ‌లు అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌హ‌రించి పారిశుధ్య మెరుగుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మండ‌ల ప్ర‌జ‌లు కోరుతున్నారు.

one9 news

Read Previous

ముదురుతోన్న వివాదం.. సీఎస్​ నీలం సాహ్నికి.. నిమ్మగడ్డ మరో లేఖ..ఏపీలో లోకల్ వార్

Read Next

బీజేపీ నోట మధ్యంతరం మాట… జమిలా? లేక ఇంకేదైనా లిటిగేషనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *