Breaking News

బీజేపీ నోట మధ్యంతరం మాట… జమిలా? లేక ఇంకేదైనా లిటిగేషనా?

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో బీజేపీ నేతల మాటల్లో పదును పెరుగుతోంది. ప్రచారాన్ని వేడెక్కిస్తున్న కమలనాథుల నోట తాజాగా మధ్యంతర ఎన్నికల మాట వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని ప్రకటించారు బీజేపీ తెలంగాణ యూనిట్ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.

గ్రేటర్ ప్రచారంలో భాగంగా బండి సంజయ్ శనివారం ముషీరాబాద్ ఏరియాలో రోడ్ షోలో పాల్గొన్నారు. భోలక్‌పూర్ ఏరియాలో రోడ్‌షోలో ప్రసంగించారు. ‘‘ ఈ జీ.హెచ్.ఎం.సీ. ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోంది.. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రభుత్వం నిలబడదు. తెరాస ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు.. ఎక్కువ రోజులు నిలబడే అవకాశం లేని ఈ ప్రభుత్వానికి పోలీసు అధికారులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు..? సీఎం స్క్రిప్టును మీరెందుకు చదువుతున్నారు..? ప్రజలు మా వైపు ఉన్నారు.. పోలీసు అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలి.. ’’ అంటూ పోలీసులను బండి సంజయ్ హెచ్చరించారు.

one9 news

Read Previous

ర‌ణ‌స్థ‌లంలో య‌ధేచ్ఛ‌గా పాలిథిన్ క‌వ‌ర్లు వినియోగం

Read Next

ఏపీ అసెంబ్లీలో టెన్షన్ టెన్షన్.. 13 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. మెయిన్ గేటు దగ్గర బైఠాయించిన విపక్ష నేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *