
పూణేలోని ప్రముఖ ఫార్మా దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీరం సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ”తమ సంస్థలో ఈ మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అటు కోవిడ్ వ్యాక్సిన్ యూనిట్‌కు ఎలాంటి ఢోకా లేదు” అని ట్విట్టర్లో ఆదార్ పూనావాలా పేర్కొన్నారు.
ఇప్పటివరకు కొన్ని ఫ్లోర్లు మాత్రం దెబ్బ తిన్నాయని ఆయన చెప్పారు. ఎంత నష్టం జరిగిందో తరువాత అంచనా వేసి తెలియజేస్తామని ఆయన చెప్పారు.అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. కాగా, చనిపోయిన వ్యక్తులు నిర్మాణ పనుల్లో ఉన్న సిబ్బంది అయి ఉంటారని పూణే మేయర్ మురళీధర్ మొహోల్ తెలిపారు.