
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆదేశాలు, ధిక్కరణలు, కోర్టుల్లో కేసుల దశను దాటి.. నామినేషన్ల రోజూ వచ్చింది. కానీ నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఎలాంటి సన్నాహాలూ చేయలేదు. అసలు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలూ అందలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు.
గంట గంటకు ఉత్కంఠ. ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు ఏం చెప్పబోతుంది? ఎలక్షన్‌కు బ్రేకులా? ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నలా? మెగా మండే ఉత్కంఠ రేపుతోంది. ఏపీ ఎన్నికల పంచాయతీపై కాసేపట్లో విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. పంచాయతీ ఎన్నికలు ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కాసేపట్లో సుప్రీం విచారించే ఛాన్స్ ఉంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారించబోతుంది.