Tuesday, 21 May 2024 07:33:56 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా ?.. ఒక్క సినిమాతోనే తెగ ఫేమస్ అయిపోయింది.

Date : 28 June 2023 08:15 PM Views : 173

సోషల్ మీడియా / అమరావతి : ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారి జాబితాలో ఈ హీరోయిన్ ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న కథానాయిక ఎవరో గుర్తుపట్టరా ?. ఒక్క సినిమాతోనే ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.వెండితెరపై తొలి సినిమాతోనే మాయ చేసిన తారలు చాలా మంది ఉంటారు. అందులో కొందరు ఒకటి రెండు సినిమాలు చేసి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారి జాబితాలో ఈ హీరోయిన్ ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న కథానాయిక ఎవరో గుర్తుపట్టరా ?. ఒక్క సినిమాతోనే ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు అడియన్స్ మదిలో చెరగని ఆమె రూపం. ఎవరో గుర్తుపట్టండి. తనే అన్షు. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ మన్మథుడు సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తెలుగు ప్రేక్షకులకు తన పాత్రతో చేరువయ్యింది. ఈచిత్రంలో అందం, అభినయంతో కట్టిపడేసింది.అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది అన్షు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2002లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలో నటించింది. అమాయకత్వం.. ఆకట్టుకునే రూపంతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ అయిన అన్షుకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంది. ఇక ఆ తర్వాత తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అన్షు కోలీవుడ్ లో నటించిన చివరి సినిమా జై. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో.. కథానాయిక కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి లండన్ కు చెందిన సచిన్ సగ్గర్ ను 2003లో పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వీరికి పాప, బాబు ఉన్నారు. అన్షు హీరోయిన్ కావడానికి ముందు ఫ్యాషన్ డిజైనర్. దీంతో ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా గార్మంట్స్ బిజినెస్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో అన్షు చాలా యాక్టివ్. ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. రీల్స్ కూడా చేస్తుంది. తాజాగా ఆమె తన ఫ్యామిలీతో కలిసి షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

-----------------------

YTTV News

Admin

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :