Monday, 29 April 2024 05:21:58 AM
# మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్! # చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ # అర‌బిందో ఫార్మా పౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మెగా ర‌క్త‌దానం శిభిరం

విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్

Date : 19 February 2024 07:26 PM Views : 207

తాజా వార్తాలు / విశాకపట్నం జిల్లా : ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. జనసేన అధినేత పవన్ విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేతలతో వన్‌ టు వన్ మాట్లాడారు. ఆర్థిక స్థితిగతులు, రాజకీయ సమీకరణాలపై ఆరాతీశారు. ఆ తర్వాత 4 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్‌, గాజువాకకు సుందరపు సతీష్‌, పెందుర్తిలో పంచకర్ల రమేష్‌, యలమంచిలిలో సుందరపు విజయ్‌ కుమార్‌లను నియమించారు.అధికారికంగా అభ్యర్థులని కాకుండా సమన్వయకర్తలనే ట్యాగ్‌లైన్ తగిలించి 4 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అంతకుముందు ఈ నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం గణనీయమైన ప్రభావం చూపింది. ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి, గాజువాక, పెందుర్తి, యలమంచిలిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటోంది. జనసేన ఇన్‌ఛార్జ్‌ల ప్రకటనతో లోకల్ టీడీపీ నేతల్లో ఉలికిపాటు మొదలైంది. నిజానికి ఆ నాలుగు స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాస్‌.. గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్‌.. పెందుర్తి నుంచి సీనియర్ నేత బండారు సత్యనారాయణ, యలమంచిలి నుంచి ప్రగాఢ నాగేశ్వర్‌రావులు సీటు తమకేనన్న ధీమాతో ఉన్నారు. అయితే వీరిలో సీటు త్యాగం చేసేదెవరు..? పట్టుబట్టి సీటు సాధించుకునేదెవరన్న చర్చ మొదలైంది. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో నాగబాబును బరిలోకి దింపాలని జనసేన భావిస్తోంది. ఇదే స్థానంలో టీడీపీ నుంచి చింతకాయల విజయ్‌, బైరా దిలీప్‌ పోటీ చేయాలనుకుంటున్నారు. అధికారికంగా అభ్యర్థుల ప్రకటన చేయకపోయినప్పటికీ జనసేన ఇన్‌ఛార్జ్‌లను నియమించడంతో టీడీపీ నేతల్లో సీటు టెన్షన్ పట్టుకుంది.మన్వయకర్తలను ప్రకటించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా టూర్‌కి బయల్దేరారు పవన్ కల్యాణ్‌. మంగళవారం ఉమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశాలతో పాటు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటిస్తారని తెలుస్తోంది. 21న భీమవరంలో టీడీపీ-జనసేన నేతలతో ఆత్మీయ సమావేశంలో పవన్ పాల్గొంటారు. మరోవైపు భీమవరం నుంచి పవన్ పోటీ చేయడం ఖాయమంటున్నారు పార్టీ నేతలు.ఇన్‌ఛార్జ్‌ల ప్రకటన వేళ పవన్ హస్తిన పర్యటన ఖరారైంది. ఈనెల 22న ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమావేశంకానున్నారు. ప్రధానంగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనున్నారు. తిరిగొచ్చాక అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :