Tuesday, 14 May 2024 08:48:16 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

త్వరపడండి.. పాపికొండల పర్యటనకు వేళాయే.. ఏపీ టూరిజం అందిస్తున్న స్పెషల్ ప్యాకేజీలు ఇవే..

Date : 17 December 2022 11:16 AM Views : 229

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : పుణ్య క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు మనసు దోచుకునే అందమైన ప్రకృతి సౌందర్యం మన తెలుగు రాష్ట్రాల సొంతం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం మధ్య లాంచీ ప్రయాణం గురించే. జర్నీ టైమ్ లో వచ్చే పాపి కొండలు, గంభీరంగా సాగిపోయే గోదావరి అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) స్పెషల్ ప్యాకేజెస్ ను ప్రకటించింది. పండుగ సమయాలు, సెలవు రోజుల్లో కుటుంబంతో కలిసి విహరించేలా ప్లాన్ చేసింది. ఒకటి, రెండు రోజుల టూర్‌లను రాజమహేంద్రవరం, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఈ మేరకు ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్‌ మేనేజర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు.రాజమహేంద్రవరం, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్‌ : 98486 29341, 98488 83091, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్‌ : 63037 69675 నంబర్ కు సంప్రదించాలని కోరారు. రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు ఒక రోజు పర్యటనకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు యాత్ర కొనసాగుతుంది. పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్‌ ఇస్తారు. రెండు రోజుల పర్యటనలో రాజమహేంద్రవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకరోజు, రెండు రోజుల పర్యటనలు ఉన్నాయి. గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన కు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. రెండు రోజుల పర్యటన ఉదయం 7.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు ఉంటుంది. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. ఆసక్తి కలిగిన వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :