Tuesday, 14 May 2024 02:17:57 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెయిన్ అలెర్ట్.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు..

Date : 18 March 2023 03:44 PM Views : 297

తాజా వార్తాలు / అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.ఇవాళ, రేపు కూడా వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. అంతర్గత తమిళనాడు నుంచి మధ్య మధ్యప్రదేశ్ వరకు గల ద్రోణి / గాలి కోత ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ & పొరుగున గల ఉపరితల ఆవర్తనం తో కలసి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని వాతావరణ శాఖ పేర్కొంది.రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది. సోమవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి.. తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :