Wednesday, 15 May 2024 04:14:16 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపుపై సజ్జల కీలక ప్రకటన.. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లే అలా జరిగిందంటూ..

Date : 05 December 2022 05:23 PM Views : 233

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తుందంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే పంచాయతీ రాజ్‌ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారని కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలు ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కలవరపాటుకు గురిచేశాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సందించారు. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని సజ్జల స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వడమే తప్ప తొలగించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఇక పంచాయతీరాజ్‌ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారని.. దీనిపై సీఎం జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్ వలన కింది స్థాయిలో ఆ ఆర్డర్ వచ్చి ఉంటుందని, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపును ఉపసంహరించుకోవాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు సజ్జల తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందనే వార్తలు ఉద్యోగ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ జేఏసీ అమరావతి, ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే కీలక ప్రకటన చేశారు సజ్జల.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :