Tuesday, 14 May 2024 12:59:19 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి సందడి.. శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు.. బారులు తీరిన భక్తులు

Date : 18 February 2023 03:33 PM Views : 164

తాజా వార్తాలు / అమరావతి : హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో కిట కిట లాడుతున్నాయి శివాలయాలు. తెల్లవారుజామున నుండి భక్తుల ప్రత్యేక అభిషేక పూజలు.. మహాశివరాత్రి , శనిత్రయోదశి విశిష్టత కావడంతో భక్తుల ప్రత్యేక పూజలు చేస్తున్నారు.మహాశివరాత్రి పర్వదినం ఈసారి శనిత్రయోదశి, శనివారం రోజు రావడం మరింత శుభప్రదమని చెబుతున్నారు పండితులు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో కిట కిట లాడుతున్నాయి శివాలయాలు. తెల్లవారుజామున నుండి భక్తుల ప్రత్యేక అభిషేక పూజలు.. మహాశివరాత్రి , శనిత్రయోదశి విశిష్టత కావడంతో భక్తుల ప్రత్యేక పూజలు చేస్తున్నారు.మహాశివరాత్రి సందర్భంగా అమరావతి అమరేశ్వరాలయం లో తెల్లవారుజామున నుండే భక్తులు రద్దీ నెలకొంది. కృష్ణానదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి బాలా చాముండికా సమేత అమరేశ్వరునికి పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం భక్తుల శివనామస్మరణ తో మారుమ్రోగింది. మహా శివరాత్రి, శని త్రయోదశి కలిసి రావడంతో శైవ క్షేత్రాలతో సహా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున నుండి భక్తులు వృద్ధ గౌతమి గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి మహాశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామిని దర్షించు కోవడానికి ఆలయం వద్ద క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. రాత్రి ఒంటిగంటకు స్వామివారికి తొలి అభిషేకం చేశారు అర్చకులు. మహానంది క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం శేష వాహనం,సాయంత్రం నంది వాహనం పై భక్తులకు శివయ్య దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 10 గంటలకు లింగోద్భవ కార్యక్రమం జరుగనుంది. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి కళ్యాణం జరిపించనున్నారు. రాత్రి జాగరణ సందర్భంగా ఆలయ పరిసరాలలో సంస్కృత కార్యక్రమాలను నిర్వహించనున్నారు.తెలంగాణలోని ప్రముఖ శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వేములవాడ, కీసర గుట్ట, రామప్ప గుడి, రాజేంద్రనగర్ సర్కిల్ రాంబాగ్ చిన్న అనంతగిరి దేవాలయంలో హైదర్ గూడ ప్రణవభక్త సమాజం ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటల నుండి మహా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం సుమారు 50 వేల మంది చిన్న అనంతగిరి దేవాలయాన్ని మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సందర్శిస్తున్నారు. 400 ఏండ్ల చరిత్ర గలిగిన ఈ దేవాలయం లో భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకంతో ఈ సంవత్సరం సుమారు 80 వేల మంది మహాశివరాత్రి పర్వదినని పురస్కరించుకొని చిన్న అనంతగిరి దేవాలయాన్ని సందర్శిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్న అనంతగిరి దేవాలయాన్ని సందర్శించడానికి రాంబాబు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కాక హైదరాబాద్ నుండి ప్రజాసంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తారు. అత్తాపూర్ అవుట్ పోస్ట్ పోలీసులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నుండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ ఏసిపి గంగాధర్ తో పాటు అత్తాపూర్ అవుట్ పోస్ట్ సిఐ క్రాంతి కిరణ్ రాజేంద్రనగర్ సిఐ నాగేంద్రబాబు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :