Tuesday, 14 May 2024 02:37:38 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచిన వైసీపీ..

Date : 16 March 2023 10:12 AM Views : 194

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది. స్థానిక సంస్థల ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంట లోగా రావచ్చు. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు రేపు అర్ధరాత్రి వరకూ రావచ్చు.. గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు ఎల్లుండి సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది.కర్నూలులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం.. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. 988 ఓట్ల మెజారిటీతో ఆయన విజయాన్ని దక్కించుకున్నారు. అనుకున్న ఓట్లు కంటే వైసీపీకి అదనంగా 50 ఓట్లు వచ్చాయి. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలవగా.. 1083 ఓట్లు మాత్రమే చెల్లినవిగా పరిగణించారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 542 ఎవరికి వస్తాయో వారిని విజేతగా ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.. అయితే, వైసిపి అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌ పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో విజేతగా ప్రకటించారు ఎన్నికల అధికారులుకర్నూలులో ముగిసిన ఓట్ల లెక్కింపు.. కాసేట్లో ఫలితం.. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 53 ఓట్లు చెల్లనివి పక్కన పెట్టగా.. 1083 ఓట్లు మాత్రమే చెల్లినవిగా పరిగణించారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 542 ఎవరికి వస్తాయో వారిని విజేతగా ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.. అయితే, వైసిపి అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌కి ఇప్పటికే పూర్తిస్థాయి మెజారిటీ వచ్చింది. మరి కాసేపట్లో తుది ఫలితాన్ని ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం వైసీపీ ఖాతాలో మరో విజయం చేరింది. పశ్చమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కవురు శ్రీనివాస్‌ గెలిచారు. మొత్తం 418 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్ధి వంకా రవీంద్రకు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి 122 ఓట్లు రాగా.. మోత్తం పోలైన ఓట్లు 1088 ఓట్లలో 25 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి విజయం.. శ్రీకాకుళంలో ఓట్ల లెక్కింపు ముగిసింది. స్థానిక సంస్థల MLC కౌంటింగ్‌లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. మొత్తం ఓట్లలో వైసీపీ అభ్యర్థికి 632 ఓట్లు పోలయ్యాయి. పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు రాగా.. చెల్లని ఓట్లు 12 వచ్చాయి. కర్నూలులో కొలిక్కి వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితం కర్నూలులో ఓట్ల లెక్కింపు ఓ కొలిక్కి వస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితం రానుంది. ఇప్పటికే 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్న వైసీపీ.. వైసీపీ తరఫున పోటీలో ఉన్న డాక్టర్ మధుసూదన్. మొత్తం ఓట్లు 1178, పోలైనవి 1136.. మరోగంటలో గెలుపుపై పూర్తి క్లారిటీ రానుంది.లెక్కింపు విషయంలో ఈ అధికారులు జాగ్రత్తలు మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కౌంటింగ్‌కు ముందు ఆ ఓట్లను పక్కన పెడుతారు.. ఏపీలో 9 ఎమ్మెల్సీ కౌంటింగ్‌ మొదలైంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కనపెట్టనున్నారు సిబ్బంది. ఆపై పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు పెడుతారు. కర్నూలు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 49 మంది పోటీ చేస్తున్నారు. విశాఖ గ్రాడ్యుయేట్‌ స్థానంలో 37 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 22 మంది పోటీ పడుతున్నారు. కడప, అనంతపురం, కర్నూలు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది పోటీలో ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది నువ్వా నేనా అనే తరహాలో పోటీ పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానిక సంస్థల స్థానాలకు బరిలో ఆరుగురు.. పూర్తిస్థాయి ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం వెలువడే చాన్స్‌ ఉంది.తెలంగాణలోనూ ఒక టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల లెక్కింపు తెలంగాణలోనూ ఒక టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల లెక్కింపు జరుగుతోంది. ఇందులో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ సీటు కోసం పోలింగ్ జరిగింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభమైంది. పోటీలో చెన్నకేశవరెడ్డి, జనార్థన్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, హర్షవర్థన్, మాణిక్‌ రెడ్డి ఉన్నారు.మూడు భాగాలుగా చేసి దానికి ఒకటి కలపగా వచ్చిన.. రెండు స్థానాలు ఉన్నచోట అంటే పశ్చిమగోదావరిలో మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను మూడు భాగాలుగా చేసి దానికి ఒకటి కలపగా వచ్చిన విలువను ప్రాధాన్యతగా తీసుకుంటారు. ఇలా మొదటి ప్రాధాన్యత ఓటును నిర్దేశిత కోటా చేరుకోకుంటే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. ఒకవేళ నిర్దేశిత కోటా గనుక చేరుకుంటే ఆ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు.ఒక్కో ఓటు విలువ ఎలా మారుతుందంటే.. సాధారణంగా ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఒక ఓటర్ వేసే ఓటు విలువ ఒకటిగా ఉంటుంది.అదే ఒకే చోట రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరిగితే ఒక్కో ఓటు విలువ 100గా పరిగణిస్తారు.పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండటంతో అక్కడ ఒక్కో ఓటు విలువ 100గా లెక్కకడతారు. కౌంటింగ్ చేసేటప్పుడు ఒక స్థానమైతే మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువను సగం చేసి దానికి ఒకటి కలిపి వచ్చిన విలువను బట్టి గెలుపు నిర్ణయిస్తారు..ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన.. బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన ఉంటుంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కన పెట్టేస్తారు. బ్యాలెట్‌ పేపర్‌లో 1,2 3 అంకెలకు బదులు ABC లేదా ఇతర అక్షరాలు ఉన్న బ్యాలెట్‌ పేపర్లను చెల్లని ఓట్లుగా పరిగణిస్తారు. మిగిలిన ఓట్లను లెక్కలోకి తీసుకొని ఒక కోడ్‌ ప్రకారం లెక్కింపు చేపడతారు.ఎక్కడ ఎంత మంది అంటే.. విశాఖ గ్రాడుయేట్‌ స్థానం నుంచి 37 మంది, కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 49 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి 22 మంది పోటీలో ఉన్నారు. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది, ప్రకాశం నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 8 మంది పోటీలో నిలిచారు.గెలుపు తమదంటే తమదే.. ఈ ఎన్నికల్లో దాదాపు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గెలుపు తమదంటే తమదని రాజకీయ పార్టీలన్నీ బలంగా చెప్తున్నాయి. అన్ని స్థానాలు తమవేనని అధికార YCP ప్రకటించింది. మరో వైపు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఆ అభ్యర్థులకు ఓటు వేయమని జనసేన చెప్పకపోవడం ఈ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 13న జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమగోదావరి స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. 3 గ్రాడుయేట్‌, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన ఉంటుంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :