Tuesday, 14 May 2024 10:48:13 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

గోదావరిలో హైఓల్టేజ్‌ పొలిటికల్ హీట్‌

Date : 08 August 2023 12:39 PM Views : 105

తాజా వార్తాలు / కోనసీమ జిల్లా : ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరొక్కరు ప్రతిపక్ష నేత. ఇద్దరి మధ్య నిత్యం మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతోన్న తరుణంలో వీరిద్దరి మధ్య మాటలు తూటాలపై పేలుతున్నాయి. ఈ సమయంలో ఇద్దరు నాయకులు ఒకే చోట ఉండడం ఆసక్తిగా మారింది. గోదావరి జిల్లాలో హైఓల్టేజ్‌ పొలిటికల్ హీట్‌ కనిపిస్తోంది. ఓ పక్క సీఎం జగన్‌, మరోపక్క విపక్షనేత చంద్రబాబు పర్యటన ఆసక్తికరంగా మారింది. సోమవారం రాత్రి సీఎం జగన్‌ ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో జగన్‌ బస చేస్తే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మొంపూడి జంక్షన్‌ దగ్గర బస చేశారు. దీంతో అందరిలోనూ ఆసక్తినెలకొంది.ఇద్దరు కీలక నేతలు ఒకేచోట ఉండడంతో రాజమండ్రిలో హైటెన్షన్‌ కనిపిస్తోంది. వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు సోమవారం సీఎం జగన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పోలవం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరి పర్యటనలు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు ఒకే జిల్లాలో పర్యటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొన్నటి మొన్న పుంగనూరులో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం మంగళవారం సీఎంతో పాటు ప్రతిపక్ష నేత పర్యటిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు జగన్‌ మోహన్‌ రెడ్డి ఉదయం 10 గంటలకు ముమ్మిడివరం మండలం గురజపులంక వెళ్లనున్నారు. అక్కడ ముంపు బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం తానేలంక, తోటరాముడిపేట వరద బాధితులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఇక మరోవైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఈ రోజు పురుషోత్తమపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను పరిశీలించనున్నారు. కోరుకొండలో రోడ్‌ షో, బస్టాండ్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మరి నువ్వా, నేనా అన్నట్లు సాగుతోన్న ఇద్దరి నాయకుల పర్యటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో చూడాలి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :