Tuesday, 14 May 2024 04:25:35 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాల్లో 20.73 శాతం మందికే అర్హత.. దేహదారుఢ్య పరీక్షలు ఎప్పుడంటే..

Date : 06 February 2023 06:08 PM Views : 259

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటి ఫలితాలు ఫిబ్రవరి 5న విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగున్నర లక్షల మంది పరీక్ష రాస్తేవారిలో కేవలం 95,209 మంది అంటే 20.73 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత పొందారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. ఈ లెక్కన మొత్తం 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల్లో ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారందరికీ త్వరలో పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. వీరంతా స్టేజ్‌-2 పరీక్షల కోసం ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుందని బోర్డు తెల్పింది.సమాధానాల ‘కీ’కి సంబంధించి మొత్తం 2,261 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో మూడు ప్రశ్నల సమాధానాలను ‘కీ’లో మార్చినట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ సమాధానపత్రాల ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. సందేహాలు ఉంటే 94414 50639, 91002 03323 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :