Tuesday, 14 May 2024 03:23:11 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై కొత్త నిబంధనలు.. ఆదేశించిన ఏపీ హైకోర్టు

Date : 03 November 2023 04:27 PM Views : 83

తాజా వార్తాలు / అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అయితే ఆయన బెయిల్‌పై ఐదు షరతులను విధించింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు బయటకు వచ్చిన వెంటనే మీడియ సమావేశం ఏర్పాటు చేసి, ర్యాలీలుగా వెళ్లారని సీఐడీ అధికారులు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు ఐదు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌కు అదనంగా మరిన్ని నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఆయన ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారో ఆవిషయాలను జైలు అధికారులకు తెలియజేయాలని పేర్కొంది. నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు తన శస్త్ర చికిత్స తీసుకున్న రిపోర్టులన్నీ సీల్డ్ కవర్లో తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు హాజరుకావాలని సూచించింది. చంద్రబాబుకు హైకోర్టు విధించిన నిబంధనలు.. 1. రాజకీయ యాత్రలు, ప్రసంగాలు చేయకూడదు, సభలు నిర్వహించకూడదు. 2. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. 3. కేవలం వైద్యం నిమిత్తమే బెయిల్‌ని ఉపయోగించాలి. 4. ఈ కేసుకు సంబంధించి వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడకూడదు. 5. సీఐడీ అధికారులు కోరిన డీఎస్పీల పర్యవేక్షణ అంశాన్ని తోసిపుచ్చింది. మొదలైన వైద్య చికిత్స.. చంద్రబాబు గురువారం ఉదయం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని సూచించారు. వైద్యుల సూచనతో నేడు చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వెంట కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి ఉన్నారు. ఆయన కుడి కంటికి క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి కంటి డాక్టర్ నిర్ధారించారు. దీంతో పాటు రిపోర్టు ఇవ్వగా.. బాబు కుడి కంటిలో ఇమ్మెచ్యూర్‌ క్యాటరాక్ట్‌ ఉందని, దానికి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఇక్కడ ట్రీట్‌మెంట్ ముగిసిన అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తారు చంద్రబాబు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :