Tuesday, 14 May 2024 02:17:00 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మ‌హిళా సాధికార‌తే ప్ర‌ధాన ధ్యేయం...మంత్రి ధ‌ర్మాన

Date : 02 April 2023 08:10 PM Views : 263

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం ర‌ణ‌స్థ‌లం మండ‌ల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్ లో రణస్థలం మండలము కు సంబంధించి వై.యస్. ఆర్ ఆస‌రా ప‌థ‌కం 3వవిడత కార్యక్రమంను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ల‌బ్ధిదారుల‌తో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాదరావు ,విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి,దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి,అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్ర‌కారం ప‌థ‌కాల అమ‌లును సాధ్యం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంటి గౌర‌వాన్ని పెంచే, ఇంటికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ ఇచ్చే ఇల్లాలికి అండగా ఉండేందుకు ప‌లు ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ ఉన్నాం.ఆ రోజు పాద‌యాత్ర‌లో భాగంగా డ్వాక్రా సంఘాల రుణాలు చెల్లించేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విప‌క్ష నేత హోదాలో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్ప‌టికే మూడు విడ‌తలు చెల్లించాం.ఇంకాఒక్కవిడ‌తమాత్ర‌మేచెల్లించాల్సిఉంది.ఇవాళఇన్నిప‌థ‌కాలుస‌మ‌ర్థరీతిలో,మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా అమ‌లు అవుతున్నాయంటే అందుకు కార‌ణం మీరు. 2019 లో ఓటు వేసి అధికారం ఇవ్వడం వల్లనే సీఎం జగన్ చేయగల్గుతున్నారు.ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం సంబంధించి 2040పొదుపు సంఘాలకు 22122మంది మహిళలకు వైయస్సార్ ఆసరా 3విడత ద్వారా 18 కోట్ల 1లక్ష 49వేల 506రూపాయలు చెక్కును మహిళా సంఘాలకు అక్క చెల్లెమ్మలకు మంత్రివర్యులు ధర్మానప్రసాదరావుగారు,ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది .ఇచ్చే అధికారం మీ దగ్గరే ఉంది, మళ్ళీ ఆ అధికారం మీరు అందరూ మాకు ఇవ్వాలని కోరుతున్నాము. మేలు చేసే ప్ర‌భుత్వానికి మ‌ద్దతుగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను.. 2014కు ముందు, మీకున్న అప్పులన్నీ తనకి ఓటు వేస్తే చెల్లిస్తామ‌ని ఓ పెద్ద మ‌నిషి చెప్పారు. మహిళా సంఘాలు చేసిన అప్పులు, రైతాంగం చేసిన అప్పులు తీర్చేస్తా అని చంద్రబాబు నమ్మబ‌లికారు. కానీ తాను అధికారంలోకి వచ్చాక,ఇష్టాను సారంగా డబ్బు దుబారా చేసి తనవారికి,త‌న అనుకున్న వారికి పప్పు,బెల్లంలా పంచి పెట్టారు. ఇచ్చిన మాట మాత్రం నిల‌బెట్టుకోలేక‌పోయారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సంద‌ర్భంలో మీ సంఘాలు అన్నీ ఆయ‌న్ను కలిశాయి. ఆ సంద‌ర్భంగా డ్వాక్రా రుణాలు 4 విడతల్లో చెల్లిస్తాం అని జగన్ చెప్పారు. ఇచ్చిన మాట ప్ర‌కారం ఇప్పటికే మూడు విడత‌లుగా రుణాల చెల్లింపు అన్న‌ది బ్యాంకుల‌కు చేసేశాం. మీ మీద ఒత్తిడి తీసుకు రాకుండా సీఎం జగన్ బ్యాంకర్స్ తో మాట్లాడారు. లేకపోతే ఇతర పథకాల పేరుతో వ‌చ్చే డ‌బ్బులు అన్నీ బ్యాంకర్స్ తీసుకునే వారు. ఆ రోజు అంటే 2014లో తాళం చంద్రబాబు కి ఇస్తే అందరినీ మోసం చేశారు.2019 లో జగన్ కి తాళం ఇస్తే చెప్పినవే కాకుండా,చెప్పనవి కూడా అమలు చేసి అండగా ఉంటున్నారు. మీరు ఈ తేడాను గ‌మ‌నించాలి. మీ అందరినీ శక్తి వంతులుగా చేస్తున్న ఈ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌వాలి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆశ‌లు అన్నీ మీ పైనే. నా అక్క చెల్లెమ్మ‌లంతా నాకు అండ‌గా ఉంటార‌ని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారు. ఆయ‌న న‌మ్మ‌కాన్ని మీరు నిల‌బెట్టాలి.దుర్మార్గంగా,అన్యాయంగా పథకాల తో సఫా చేస్తున్నాడు జగన్ అని చంద్రబాబు అంటున్నారు. అంటే మీకు ఇస్తున్న పథకాలు వృథా అని ఆయన ఉద్దేశం. కానీ ఇవాళ ముఖ్య‌మంత్రి ఆలోచ‌న ప్ర‌కారం ప్ర‌తి ఒక్క అర్హుడికీ ప‌థ‌కాలు అందించేలా చేయ‌డ‌మే ధ్యేయం. అందుకు జెండా చూడొద్దు. ఓటు వేశారో లేదో చూడొద్దు. ఇంటి మీద మా పార్టీ జెండా కట్టారో లేదో చూడొద్దు. రేపు మాకు ఓటు వేస్తారో లేదో చూడడం లేదు, అర్హుల‌యిన ల‌బ్ధిదారుల కళ్ళలో సంతోషం చూడాలి. కడుపు నింపి ఆనందం చూడాలి. సమాజంలో సంతోషంగా జీవించాలి ఇదే మా పార్టీ సిద్ధాంతం. జ‌గ‌న్ ఆచ‌రించి చూపిస్తున్న విధానం.మీ పిల్లలు ధనవంతులు పిల్లలు మాదిరిగానే చ‌దువుకునే విధంగా అందుకు త‌గ్గ సౌకర్యాలు అన్నీ అందే విధంగా చేస్తున్నాం. అమ్మ ఒడి పేరిట ప్ర‌తి త‌ల్లి ఖాతాకు ప‌దిహేను వేలు రూపాయ‌లు జ‌మ చేస్తున్నాం. నాడు నేడు పేరిట పాఠ‌శాల‌ల ఆధునికీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇచ్చాం. గ‌తంలో క‌న్నా ఇప్పుడు పాల‌న మీ చెంత‌కే తీసుకువ‌చ్చే విధంగా గ్రామ స‌చివాల‌యాలను ఏర్పాటు చేసి, అందుకు త‌గ్గ సిబ్బందిని నియ‌మించాం. అలానే మ‌ధ్యవ‌ర్తుల ప్ర‌మేయం అన్న‌ది లేకుండా ప‌థ‌కాల వ‌ర్తింపున‌కు కృషి చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్,DRDA పీడీ విద్యాసాగర్,రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు పేరాడ తిలక్,మామిడి శ్రీకాంత్,బల్లాడ హేమమాలిని రెడ్డి,ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ ప్రతినిధి లంకలపల్లిప్రసాద్,రణస్థలం,జి.సిగడాంమండలంఎంపీపీలుపిన్నింటిరజని,మీసాలవెంకటరమణ,జడ్పీటీసీలుటొంపలసీతారాం,కాయలరమణ,రణస్థలం, ఎచ్చెర్ల మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు,జరుగుళ్ల శంకరరావు,జే.సి.యస్ ఇంచార్జి లు చిల్ల వెంకటరెడ్డి,డోల వెంకటరమణ,వైస్ ఎంపీపీలు రాయపురెడ్డి బుజ్జి,మైలపల్లి కామరాజు,PACS చైర్మన్లు గొర్లె తిరుపతినాయుడు,సనపల నారాయణరావు,FSCS చైర్మన్ కరిమజ్జి భాస్కరరావు,రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బల్లాడ జనార్దన్ రెడ్డి,రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్పిల్లఆనంద్పాత్రుడు,సర్పంచ్లుసంఘం,ఎంపీటీసీలసంఘంఅధ్యక్షులురెడ్డివిశ్వేశరావు,మహంతిచిన్నరామునాయుడు,నాయకులుగొర్లెఅప్పలనర్సునాయుడు,గొర్లె అప్పలనాయుడు,మహిళా అధ్యక్షురాలు గురాన తిరుమల మానస,టెలికాం డైరెక్టర్ బడి రాంబాబు,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెంటాడ స్వరూప్,జె. ఆర్ పురం పంచాయతీ సర్పంచ్ బవిరి రమణ,ఎంపీటీసీ ప్రతినిధి పచ్చిగుళ్ల సాయిరాం,వైస్ సర్పంచ్ దన్నాన సీతారాం,రణస్థలం మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ టేకి బ్రహ్మాజీ,నాయకులు నారాయణశెట్టి శ్రీనువాసరావు,బవిరి ప్రదీప్,వై. యస్.ఆర్ విద్యార్థి విభాగం,వై.యస్.ఆర్ సేవాదల్ జోనల్ ఇంచార్జి లు వడ్డాది పాణి కుమార్,పిన్నింటి గౌరినాయుడు,రణస్థలం మండలం స్పెషల్ ఆఫీసర్ దుర్గారావు,మండల తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్,ఎంపీడీఓ ధనుంజయ రావు,ఏపీఎం వెంకటరత్నం,రణస్థలం మండలం సర్పంచ్లు,ఎంపీటీసీలు,గ్రామ సచివాలయం కన్వీనర్లు,గృహ సారథులు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,వెలుగు CF,CC,లు మహిళా సంఘ సభ్యులు,అధిక సంఖ్యలో మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :