Wednesday, 15 May 2024 02:29:37 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మెంటల్ ఆసుపత్రిలో చేరాలి.. అసహనంతో హింసను రెచ్చగొడుతున్నారు.. పవన్, చంద్రబాబుపై YSRCP ఫైర్..

Date : 13 August 2023 06:18 PM Views : 142

తాజా వార్తాలు / అమరావతి : అమరావతి, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలు జనసేన, టీడీపీ మాటల తూటాలతో దూసుకెళ్తున్నాయి. ఒకటంటే.. రెండంటాం.. అంటూ పవన్ కల్యాణ్ టార్గెట్‌గా వైఎస్‌ఆర్‌సీపీ మండిపడుతోంది. రుషికొండ నిర్మాణాలతో మొదలైన రగడ కాస్త.. చినికి చినికి గాలి వానలా మారింది. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చిన పవన్‌ కల్యాణ్‌పై అధికారపార్టీ వైసీపీ కౌంటర్‌ ఎటాక్‌ చేస్తూ వస్తోంది. నిన్నటి వ్యాఖ్యల మంటలు చల్లారకముందే.. తాజాగా వైసీపీ మంత్రలు పవన్‌ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మినిస్టర్స్.. అంబటి రాంబాబు, రోజా, కారుమూరి తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖ బ్రాండ్‌ను నాశనం చేసేలా పవన్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి రోజా. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదంటూ వార్నింగ్‌ ఇచ్చారు అంబటి. పవన్‌ ఇలాగే మాట్లాడితే ప్రజలే ఛీకొడతారన్నారు మరో మంత్రి కారుమూరి. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అయితే.. పవన్‌పై పర్సనల్‌ ఎటాక్‌కి దిగారు. దీంతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. పవన్ కల్యాణ్ పై మంత్రులు ఏమన్నారో ఒకసారి చూద్దాంఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్‌కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు,పవన్‌కళ్యాణ్‌ చాలా అసహనంతో ఉన్నారు. పవన్ చంద్రబాబుతో కలిసి హింసను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇద్దరు అసహనంతో సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ లక్ష్యమన్నారు. పవన్‌కళ్యాణ్‌ జనసేన కార్యకర్తలను నిండా ముంచుతారని హెచ్చరించారు. సీఎం జగన్‌పై పవన్‌ అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని.. ప్రాజెక్ట్‌ల పేరుతో గతంలో టీడీపీ దోపిడీకి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పవన్‌కళ్యాణ్‌ తనకు మోసం చేశాడని స్వయంగా రేణుదేశాయ్‌ ఆరోపించారన్నారు అంబటి రాంబాబు. హిందూ మహిళగా ఆమె చేసిన కామెంట్లను తాను సమర్ధిస్తునట్టు తెలిపారు. అయితే ఏపీ ప్రజలు పవన్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వరని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.బ్రాండ్‌ను నాశనం చేస్తున్నారు..విశాఖ బ్రాండ్‌ నాశనం చేసేలా చంద్రబాబు, పవన్‌ మాట్లాడుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. రుషికొండపై నిర్మాణాలన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయన్నారు. రుషికొండపై కొత్త భవనాలు కడితే తప్పేంటి..? నిబంధనలకులోబడే రుషికొండపై నిర్మాణాలు జరుగుతున్నాయి.. పవన్‌ మెంటల్‌ హాస్పిటల్‌లో చేరాలంటూ రోజా ఫైర్ అయ్యారు. ఎన్ని కుట్రలు చేసినా విశాఖ రాజధాని రాకుండా ఆపలేరు.. అంటూ రోజా స్పష్టంచేశారు.ప్రజలే ఛీ కొడుతారు..వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువైందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. వాలంటీర్ల వ్యవస్థను పవన్ దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు..పవన్‌ ఇలాగే మాట్లాడితే ప్రజలే ఛీకొడతారంటూ విమర్శించారు.నిర్మాణాలన్నీ సక్రమమే..విశాఖలో కబ్జాలు, అక్రమాలపై పవన్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. తమ సంస్థ చేపట్టిన నిర్మాణాలన్నీ సక్రమేనని స్పష్టం చేశారు. ఇక కుటుంబసభ్యుల కిడ్నాప్‌ డ్రామాను వక్రీకరిస్తున్నారని మండిపడ్డ ఎంవీవీ.. విశాఖలో పవన్‌కు అడుగుపెట్టే అర్హతే లేదన్నారు. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌పై పర్సనల్ ఎటాక్‌కి దిగారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. పెళ్లిళ్లు, పిల్లల ప్రస్తావన తీసుకొచ్చారాయన. మరోవైపు చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నాడని విమర్శించారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :