Tuesday, 14 May 2024 06:43:19 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఉత్తరాంధ్రలో ఆస్తులన్నీ పరాయివాళ్లవే..

Date : 23 October 2022 07:03 PM Views : 218

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా.. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన.. సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్రలో ఆస్తులన్నీ పరాయివాళ్ల చేతుల్లోనే ఉన్నాయని అన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవడం దారుణం అన్నారు. ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉందని అన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయుంటే.. ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోయేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సీఎం ఆలోచనతోనే.. ఇప్పుడు విశాఖకు రాజధానిగా అవకాశం వచ్చిందన్నారు. కానీ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, శివరామకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా అమరావతి రైతులు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతులది రాజ్యాంగ విరుద్ధమైన యాత్ర అని విమర్శించారు. తమ స్వార్థం కోసం వింత వాదన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజధానిగా విశాఖను వ్యతిరేకించడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్పీకర్ తమ్మినేని సంచలన ఆరోపణలు.. అమరావతి రైతులది యాత్ర కాదు డ్రామా అన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఈ యాత్రను వెనకుండి నడిపిస్తున్నదెవరో అందరికీ తెలుసన్నారు. రైతుల పేరుతో బినామీలు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు సీతారాం. ఉద్యమమంటే నిజాయితీగా చేయాలని సూచించారు. డ్రామాలు చేస్తున్నవారంతా బయటపడ్డారని అన్నారు. విశాఖ అద్భుతమైన సిటీ అని, విశాఖను రాజధానిగా ఎందుకు చేయొద్దో చెప్పాలన్నారు స్పకర్ తమ్మినేని. బంధువుల కోసం విజయవాడకు 30 కి.మీ దూరంలోని.. అమరావతిని ఎంపిక చేశారని ఆరోపించారు స్పీకర్ తమ్మినేని. ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఖచ్చితంగా జరిగిందని ఆరోపించారు. విశాఖ రాజధాని ఏర్పాటుకు తోడ్పడాలని న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కోరుతున్నానని స్పీకర్ తమ్మినేని అన్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు స్పీకర్ తమ్మినేని. రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా పవన్‌కు లేవన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :