తాజా వార్తాలు / అమరావతి : తూర్పు-పశ్చిమ గాలి కోత 19°ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 4.5 & 5.8 కి.మీల ఎత్తులో కొనసాగుతున్నది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పడమటి గాలులు వీస్తున్నాయి. దీంతో రానున్న 3 రోజులు..తూర్పు-పశ్చిమ గాలి కోత 19°ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 4.5 & 5.8 కి.మీల ఎత్తులో కొనసాగుతున్నది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పడమటి గాలులు వీస్తున్నాయి. దీంతో రానున్న 3 రోజులు మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు కూడా ఒకే విధమైన వాతావరణం ఉండనుంది. ఈ రోజు, రేపు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే బలమైన గాలులు గంటకు 30-40కి.మీ. వేగంతో 1 లేదా 2చోట్ల వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.అలాగే ఎల్లుండి ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సమాచారం అందించింది.
-----------------------
Admin