Tuesday, 14 May 2024 11:38:35 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

అందుకే తల్లిపాలు ఇవ్వాల్సిందే..

Date : 08 August 2023 12:57 PM Views : 109

తాజా వార్తాలు / అమరావతి : ఈ మధ్యకాలంలో మహిళలు అందం తగ్గిపోతుందని పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం మానేస్తున్నారు. అలాంటి వారి పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్య పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారంటున్నారు నిపుణులు. ఎందుకంటే తల్లిపాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్క బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకు తల్లిపాలు కచ్చితంగా అవసరం. ఈ ఆరు నెలలు తల్లిపాలు తప్ప మరొకటి ఇవ్వద్దని చెప్తుంటారు నిపుణులు. తల్లిపాల గొప్పతనం గురించి పరిశోధనలో మరో గొప్ప సంగతి బయటపడింది. తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్ అనే చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది నవజాత శిశువుల మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని టిప్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పుట్టినప్పటినుండే మెదడులోని అనుసంధానాలు ఏర్పడుతుంటాయి దానికి తోడు మెరుగుపడుతూ వస్తుంటాయి. దీనివల్ల జెన్యు పరమైన అంశాలతో పాటు, జీవితంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలుకు దారి చూపుతుంటాయి. శిశువుల్లో తల్లిపాలు ముఖ్యపాత్రను పోషిస్తాయి, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. శిశువులలో వివిధ దశలో మెదడు ఎదుగుదలను బట్టి తల్లిపాలలోని పోషకాల మోతాదులు మారిపోతుంటాయి. ఇది మరింత ఆశ్చర్యకరం. శిశువుకి జన్మనిచ్చిన తర్వాత తొలి నెలల్లో తల్లిపాలలో పెద్ద మొత్తంలో మేయో-ఇనాసిటాల్ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమయంలోనే సినాప్సెస్ అంటే శిశువుల మెదడులో నాడి అనుసంధానాలు చాలావేగంగా ఏర్పడతాయి. మేయో – ఇనాసిటోల్ శిశువుల నాడుల మధ్య ఉన్న అనుసంధానాల పరిమాణం పెరగడానికి దానికి తోడు వాటి సంఖ్య పెరగడానికి తోడ్పడుతుంది. శిశువు పుట్టిన తొలినాళ్లు రక్తంలోని హాని కలిగించేవి మెదడులోకి చేరకుండా అడ్డుకునే బ్యాక్టీరియా అంత సమర్థంగా పనిచేయదు. దీనివల్ల శిశువు మెదడు ఆహారానికి చాలా ఎక్కువగా స్పందిస్తుండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :