Tuesday, 14 May 2024 03:52:05 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. మే 10 నుంచే ఆదర్శ పాఠశాల అప్లికేషన్స్.. పరీక్ష, ఫీజు, అర్హతల వివరాలివే..

Date : 06 May 2023 03:47 PM Views : 171

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం కోసం అప్లికేషన్స్ స్వీకరిస్తున్నట్లు స్కూల్ విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉతర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూల్స్ ఉండగా..వాటిలో 6వ తరగతిలో చేరాలనుకునేవారు ఈ నెల 10 నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. వచ్చే నెల 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లీషులో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే మోడల్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుందని, చదవాలనుకునేవారు ఎలాంటి ఫీజులు కట్టనవసరంలేదని వివరించారు.అలాగే ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 మే 9 నుంచి మే 25 వరకు net banking/credit/debit card ద్వారా Payment Gateway ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. అలా కేటాయించిన జనరల్ నెంబరు ఆధారంగా ఏదైనా ఇంటర్ నెట్ కేంద్రంలో www.cse.ap.gov.in/apms.ap.gov.in దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక ప్రవేశ పరీక్షను ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో మే 20న ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల జాబితాను జూన్‌ 16న, సీట్లు పొందిన వారి జాబితాను 18న ప్రకటిస్తారు. జూన్‌ 19 నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించనుండగా.. జూన్ 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.కాగా, ఆబ్జెక్టివ్ టైప్‌లో జరిగే ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ అభ్యర్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 30 మార్కులు సాధించాలి. కావలసినన్ని మార్కులు పొందినవారి ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయిస్తామని సురేష్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని కోరారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :