Tuesday, 14 May 2024 01:28:34 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మళ్లీ దడ పుట్టిస్తున్న కరోనా.. బడుల్లో టెన్షన్.. టెన్షన్.. లక్షణాలు ఉంటే

Date : 19 April 2023 10:20 AM Views : 192

తాజా వార్తాలు / అమరావతి : ఇక ఉండదు లే.. భయం లేదులే అనుకున్న ప్రతిసారీ.. వదల బొమ్మాళీ అంటూ దూసుకువస్తుంది కరోనా. తన రూపాన్ని మార్చుకుంటూ చాపకింద నీరులా విస్తరిస్తుంది. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి.మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది..ఇప్పటికే ఢిల్లీ సహా కేరళ , మహారాష్ట్ర లను టెన్షన్ పెడుతున్న వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా మహమ్మారి..అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో కొత్తగా మరో ఏడు కేసులు నమోదు కావడంతో..జిల్లావ్యాప్తంగా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 54కి చేరడం ఆందోళన కలిగిస్తోంది..జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతికూల వాతావరణమే రోజు రోజుకు పెరుగుతున్న కేసులకు కారణం అని చెప్పారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి 20 లక్షల బూస్టర్‌ డోస్‌లు కావాలని కేంద్రానికి లేఖ రాసింది.తెలంగాణలో మళ్లీ కరోనా భయం స్టార్ట్ అయ్యింది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 9మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి(బుధవారం) నుంచి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇందు కోసం 5 లక్షల డోసులను సిద్ధం చేసినట్టు వివరించారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు పెట్టుకోవాలి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. భయపడాల్సిన పనిలేదు కానీ.. జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా బడుల్లో భయం నెలకుంది. అక్కడక్కడా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఫైనల్ ఎగ్జామ్స్‌ జరుగుతున్న సమయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రజంట్ కరోనా టెన్షన్ పెడుతుంది. లక్షణాలు ఉంటే వారిని స్కూళ్లకు పంపవద్దని తల్లిదండ్రులకు.. వైద్య, విద్యా శాఖల అధికారులు సూచిస్తున్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :