Tuesday, 14 May 2024 05:11:35 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ..

Date : 21 December 2022 03:51 PM Views : 259

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్‌ బర్త్‌ డే కేక్‌లు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రులు, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పలు చోట్ల ప్రత్యేక రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగాను ప్రముఖులంతా జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, సినిమా తారలు.. తదితర రంగాలకు చెందిన ప్రముఖులు సీఎంకు విషెస్‌ తెలుపుతున్నారు. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే జనసేనాని పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్‌ వేదికగా విషెస్‌ తెలిపారు పవన్‌. కాగా రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లాలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో 175/175 జగనన్న పేరుతో వరి పొలంలో పంటను కోయించి అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ ఆధ్వర్యంలో ఆరు వందల కేజీల భారీ కేక్‌ను కట్‌చేసి సీఎం జగన్‌కు బర్త్‌డే విషెష్ చెప్పారు వైసీపీ లీడర్స్‌. విజయవాడ గొల్లపూడిలో డప్పు వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం.. తలశిల రఘురామ్‌, వసంత వెంకటకృష్ణప్రసాద్‌, సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎంపీ నందిగం సురేష్‌ కలిసి కేక్‌ను కట్‌ చేశారు. ఇక నగరిలో సైతం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరి ఎంపీడీవో కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే రాజమండ్రిలో 14వేల మంది విద్యార్ధులకు ఆల్‌ఇన్‌వన్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. హ్యాపీ బర్త్‌డే సీఎం సార్‌ అంటూ కేరింతల మధ్య ర్యాలీ నిర్వహించారు స్టూడెంట్స్‌. పులివెందులలో కడప ఎంపి అవినాష్ రెడ్డి సీఎం జగన్ పై రూపొందించిన పాటను ప్రారంభించారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :