తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వైఎస్సార్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వైఎస్సార్ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 148 పోస్టులను భర్తీ చేయనున్నారు. * వీటిలో అంగన్వాడీ వర్కర్ (37), అంగన్వాడీ హెల్పర్ (108), అంగన్వాడీ మిని వర్కర్ (03) పోస్టులను భర్తీ చేయనున్నారు. * అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 10వ తరగతి, అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడీ మినీ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి పూర్తి చేసి ఉండాలి. * అభ్యర్థుల వయసు 01-07-2023 నాటికి 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ముఖ్యమైన విషయాలు.. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తలను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు 11-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు. * ఇంటర్వ్యూలను సంబంధిత డీఆర్డీవో కార్యాలయాల్లో 12-01-2023 తేదీన నిర్వహిస్తారు. * నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.. * పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
-----------------------
Admin