Tuesday, 14 May 2024 11:47:03 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ఇవే.. అప్పటి నుంచే పునఃప్రారంభం..

Date : 27 December 2022 09:00 AM Views : 672

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంత్రి.. అగ్రస్థానంలో ఉంటుంది. ఈ పండుగకు స్కూళ్లకు సెలవులు ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి కోసం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది...ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంత్రి.. అగ్రస్థానంలో ఉంటుంది. ఈ పండుగకు స్కూళ్లకు సెలవులు ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి కోసం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 17న తిరిగి తెరుచుకుంటాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేయనుండగా.. 80 రోజులు సెలవులు ఉంటాయి. జూనియర్ కళాశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక తెలంగాణలో 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఇంటర్ కాలేజీలకు ఇవే సెలవులు దినాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు రెండో శనివారం కావడం, 15న సంక్రాంతి పర్వదినాన ఆదివారం కావడంతో రెండు రోజుల సెలవులు మిస్ అవుతున్నారు. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. మరోవైపు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఫస్టియర్, మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండ్ పరీక్షలు ఉంటాయి. 2023 మార్చి 15 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :